ఫేస్ బుక్ తో కేన్సర్ రిస్క్
లండన్: ఫేస్ బుక్, మై స్పేస్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ను నిరంతరం చూస్తున్న నెటిజన్స్ కు ఒక దుర్వార్త. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ను నిరంతరం చూస్తున్న నెటిజన్స్ కేన్సర్ లాంటి పలు తీవ్ర శారీరక రుగ్మతల బారిన పడే అవకాశముందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో సభ్యుల మధ్య ప్రత్యక్ష సంబంధాలుండవు. వారి మధ్య పరస్పర సంబంధాలు నెట్ మెయిల్స్ ద్వారానే నడుస్తుంటాయి. ఇలా నెట్ ద్వారా మానవ సంబంధాలను నిర్వహించే వారిలో పలు జీవ సంబంధమైన రుగ్మతలు తలెత్తుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారు కేన్సర్, గుండె పోటు, హద్రోగం, బుద్ది మాంద్యంల్లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ కి చెందిన 'బయాలజిస్టు' జర్నల్ లో మానసిక శాస్త్రవేత్త అరిక్ సిగ్మన్ అధ్యయన నివేదిక వెలువడింది.
'పెరుగుతున్నఒంటరితనం ఆయా వ్యక్తుల జన్యు పని విధానంలో మార్పులను తీసుకొస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. హార్మాన్ స్థాయిల్ని చెడగొడుతుంది, ఆర్టిరీస్ కార్యకలాపాన్ని విచ్చిన్నం చేస్తుంది. ఆ ఒంటరితనం వల్ల మానసిక కార్యకలాపం కూడా దెబ్బతింటుంది. కేన్సర్, గుండె పోటు, హద్రోగం, బుద్ది మాంద్యం లాంటి పలు తిరుగులేని రోగాలు వచ్చే ప్రమాదముంది'అని సిగ్మన్ డైలీ మెయిల్ కు నివేదిక పంపారు. వెబ్ సైట్స్ ప్రజల్ని దూరం రీత్యా మరింత దగ్గరగా తీసుకొచ్చినప్పటికీ, సంబంధాల రీత్యా వారు మరింత దూరమవుతున్నారు. 1987 నుండి ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన కొద్దీ, ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకుని ప్రజలు మాట్లాడుకునే సమయం దారుణం పడిపోయిందని ఆ పరిశోధన వెల్లడించింది.
News Posted: 19 February, 2009
|