సియోల్: డ్రైవర్ పరీక్షలో 775 సార్లు తప్పిన దక్షిణ కొరియా మహిళ ఒకరు ఇతర డ్రైవర్లు తనను రోడ్డుపై చూడడానికి ఇష్టపడినా పడకపోయినా సరే తన వ్యాపారం నిర్వహణకై ఒక లారీ కొని నడపాలనే ఆశలను మాత్రం వదలుకోవడం లేదు. 68 సంవత్సరాల చా సా-సూన్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించడానికి లిఖిత పరీక్షలో ఉత్తీర్ణత కోసం 2005 నుంచి ప్రయత్నిస్తున్నది. కాని ఉత్తీర్ణతకు కావలసిన కావలసిన 60 శాతం మార్కులను ఆమె సంపాదించలేకపోతున్నది.
'డ్రైవర్ లైసెన్స్ పొందేందుకు నేను కొన్ని గైడ్ బుక్ లు చదివాను. ఇందుకోసం కనీసం ఐదు సంవత్సరాలు పట్టుతుందని అవి సూచిస్తున్నాయి' అని ఉత్తర జియోల్లా రాష్ట్రవాసి అయిన చా సా-సూన్ చెప్పింది. మోటారు వాహనాల వలె గ్రామాల రోడ్లపై ట్రాక్టర్లు లేదా ఆవులపై రైతులు తిరుగుతుండడం ఆ రాష్ట్రంలో సర్వసాధారణం.'ఇప్పటికే నా ప్రయత్నాలు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు గడిచాయి. అందువల్ల నేను ఈ సారి పరీక్ష పాస్ కావచ్చు. అదే నా ఆశ కూడా' అని ఆమె చెప్పింది.
ఒక వారంలో లైసెన్సు సంపాదించేందుకు వీలుగు అభ్యర్థులకు దక్షిణ కొరియాలో డ్రైవింగ్ పాఠశాలలు కోర్సులు బోధిస్తుంటాయి. అటువంటి క్లాసుకు హాజరయ్యే అదృష్టం ఆమెకు లేదు. అటువంటి క్లాసులు ఎక్కువగా బిజీగా ఉండే మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఉంటుంటాయి. కాని ఆమె తన పంతాన్ని మాత్రం వీడడం లేదు. పరీక్ష దరఖాస్తులపై ఆమె ఇప్పటి వరకు పది మిలియన్ వాన్ లకు (6800 డాలర్లకు) పైగా ఖర్చు చేసింది.'మీరు పట్టుదలగా లక్ష్యం దిశగా సాగుతుంటే దానిని చేరుకోగలరనేదే నా విశ్వాసం' అని ఆమె చెప్పింది. 'అందువల్ల నా మాదిరిగా కలను వదలుకోవద్దు. దృఢచిత్తంతో ఉండి శక్తివంచన లేకుండా ప్రయత్నించండి' అని ఆమె సలహా ఇస్తున్నది.