ఏడో ఏట లిమ్కా రికార్డు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన హై స్కూలు పరీక్ష పాసైన ఏడేళ్ల బాలిక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఇక్కడి సెయింట్ మీరాస్ ఇంటర్ కాలేజి విద్యార్థిని అయిన సుష్మా వర్మ ఏడు సంవత్సరాల మూడు నెలల 28 రోజుల వయసులో, హై స్కూలు పరీక్ష ఉత్తీర్ణురాలైన అతి చిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ గుర్తింపు పొందిందని కాలేజి అధికారులు తెలిపారు. అధికారులు పంపించిన నామినేషన్ ప్రాతిపదికగా, లిమ్కా రికార్డుల బుక్ ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదే పరీక్షను రెండేళ్ల క్రితం, తన తొమ్మిదో ఏట పాసైన బీహార్ విద్యార్థిని తథాగత్ తులసి రికార్డును సుష్మా వర్మ బద్దలుకొట్టింది.
News Posted: 22 February, 2009
|