ఫీలయ్యే రోబోలు!
లండన్: టెర్మినేటర్ ఆంగ్ల చిత్రంలో ప్రముఖ హాలివుడ్ నటుడు స్క్వాజ్ నెగ్గర్ హ్యూమనాయిడ్ పాత్రనున అద్భుతంగా పోషించిన విషయం తెలిసిందే. అదే కోవలో మానవులతో సహజీవనం చేస్తూ, అనుభూతులను పొంద గల్గే, పంచుకోగల్గే రాబోట్ లను శాస్త్రవేత్తలు రూపొందించారు. హ్యామానాయిడ్ రోబోట్ లతో పాటు పెంపుడు జంతువుగా మెసలగ్లే కుక్కల్లాంటి రాబోట్ లను సైతం 'రాబోట్ నర్సరీ'ల్లో శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ హ్యూమనాయిడ్, కుక్క రాబోట్ లు మానవులతో మెలగడంతో వాటిలో ఒక వినూత్న వ్యక్తిత్వం రూపొందుతున్నట్లు శాస్త్ర్రవేత్తలు గుర్తించారు.
హెర్ట్ ఫోర్డ్ షైర్ విశ్వవిద్యాలయానికి చెందిన లోలా కెనమెరో ఈ సామాజిక లౌక్యాన్ని నేర్చుకోల్గే రోబోట్ లను రూపొందించారు. ఈ వారం లండన్ సైన్స్ మ్యూజియంలో జరిగే కార్యక్రమంలో ఈ రాబోట్ లను విడుదల చేయనున్నారు. మనుషులతో మెసలేటపుడు (కమ్యూనికేట్) మౌలిక హావభావాలను ప్రదర్శించగల్గే, ఉద్వేగ భావాలను వ్యక్తపరచే 'ఎర్విన్' రాబోట్ తలను ఈ పరిశోధకులు రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి లౌక్యం తెలిసిన రాబోట్ లను మానవులు వినియోగించడంపై ఆ శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారని న్యూ సైంటిస్ట్ పత్రిక ప్రచురించింది. మానవుల సాన్నిహిత్యంలో ఇలాంటి రాబోట్ల ప్రవర్తనా రీతు, రాబోట్ నర్సరీలల్లో సాధించిన ఫలితాలతో పోల్చి వాటిని మరింతగా మానవీయం చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
News Posted: 23 February, 2009
|