జూలో ఒబామా, హిల్లరీ!
కౌలాలంపూర్: దక్షిణ మలేషియా జోహార్ రాష్ట్రంలోని ఒక జూలో సంరక్షకులు కొత్తగా పుట్టిన రెండు ఆఫ్రికన్ సింహం పిల్లలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ రోధమ్ క్లింటన్ పేర్లు పెట్టినట్లు మంగళవారం ఒక పత్రికా వార్త ద్వారా తెలియవచ్చింది.
ఒబామా,హిల్లరీ ఇంకా పేరు పెట్టని మరొక ఆడ సింహం పిల్ల జనవరి 16న జోహార్ జూలో జన్మించాయని జూ కీపర్ మహమ్మద్ షామ్ తెలియజేశారు.'అధ్యక్షుడు ఒబామా, సింహం పిల్ల ఒబామా పూర్వీకులది ఆఫ్రికాయే. అందువల్ల అక్కడ సంబంధం తప్పకుండా ఉంటుంది' అని షామ్ అన్నట్లు 'స్టార్' దినపత్రిక తెలిపింది.
తొమ్మిది సంవత్సరాల ఆఫ్రికా సింహాలు సితి,సరీప్ లకు ఆ పిల్లలు పుట్టాయి. పిల్ల ఒబామా గురించి షామ్ ప్రస్తావిస్తూ 'అది ఉత్సాహంతో ఉరకలెత్తుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆడుకుంటుంటుంది. బోనులో పెట్టడాన్ని ఇష్టపడదు' అని చెప్పారు. ఒబామా, హిల్లరీ పుట్టినప్పటి నుంచి జూలో ప్రధాన ఆకర్షణ అయ్యాయి. అమెరికన్ రాజకీయ నాయకుల పేర్లు పెట్టిన ఆ సింహం పిల్లల ఫోటోలు తీసుకోవడానికి టూరిస్టులు, సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
News Posted: 24 February, 2009
|