పంటిని మొలిపించే జన్యువు
న్యూఢిల్లీ: దంత సౌందర్యం, దంత సంరక్షణ స్పృహ ప్రజల్లో రోజురోజుకు పెరుగుతోంది. అందులో భాగంగా దంత సంరక్షణ, దంత సౌందర్యాన్ని పెంచే అంశాలపై పరిశోధనలు వెల్లువెత్తాయి. 'దగ్గరగా..రా...' అని పాట పాడే 'క్లోజప్' నవ్వుల్ని మన తాతల తరం వారిలోసైతం చూసే అవకాశం రానుంది. తాతాల తరం అంటే పళ్లూడిపోయి, బోసినవ్వుల ట్రేడ్ మార్క్ ఇక ఎంతమాత్రం ఉండదు. ఊడిపోయిన పళ్ల స్థానంలో కొత్త పళ్లను మొలిపించడం, పళ్ల ఎనామిల్ ను ఎప్పుడూ సజీవంగా ఉంచగల్గే 'సి టిప్ 2' అనే జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దంత వైద్యంలో ఈ జన్యవు పలు అద్భుతాలను సృష్టిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పంటి ఎనామిల్ ను మరమ్మతు చేయడం, పంటి కేవిటీలను సరికొత్తగా నివారించడం, నిరోధించడం, ఊడిన పళ్లను తిరిగి మొలిపించడం లాంటి పలు అధ్భుతాలను ఈ జన్యు చికిత్స ద్వారా సాకారం చెయ్యొచ్చు. సిటిప్ 2 జన్యువు పలు కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని, నరాల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు పలు అధ్యయనాలు తెలిపాయి. అదే సమయంలో ఈ జన్యువు పంటి అభివృద్ధికి బాధ్యత వహిస్తున్నట్లు ఓరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. ఈ అధ్యయన ఫలితాలను 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్ ప్రచురించింది. శాస్త్రవేత్తలు ఎలుకలపై పలు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. మనుషులపై ఇప్పటికింకా ప్రయోగాలు జరలేదు.
News Posted: 24 February, 2009
|