జీవనశైలితో దంత రక్షణ
వాషింగ్టన్: ఆధునిక జీవనశైలి అలవాట్లు దంత క్షయాన్ని అరికడుతాయని తాజా అధ్యయనం తెలియజేసింది. తిన్న ఆహారం పళ్లపై వేసే ప్రతికూల ప్రభావాన్నుండి రక్షించుకునేందుకు పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడడం, మంచి ఆరోగ్య స్పృహలు ఉపకరిస్తాయని గత 150 ఏళ్ల నుండి వస్తున్న అవగాహన. దంత క్షయం గురించి ఆలోచించేటపుడు కేవలం మనం భుజించే ఆహారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోరాదని, మిగతా అంశాలు కొన్ని అంతే ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఈ అధ్యయన సారధి ప్రొఫెసర్ మాంటీ దుగ్గాల్ తెలిపారు.
మనం భుజించే కొన్ని ఆహార పదార్ధాలు పంటి ఎనామిల్ పై వేసే ప్రతికూల ప్రభావం నుండి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో సహా, మనం చేపట్టే ఇతర దంత రక్షణ చర్యలు రక్షించగల్గుతాయి. 'ఆహార పదార్ధాలతో సహా పలు జీవనశైలి అంశాలు దంత క్షయాన్న కలిగించడంపై పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. మనం తినే ఆహారం, మన దంత సంరక్షణ చర్యలతో పాటు జీవనశైలి అలవాట్లను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది'అని దిగ్గాల్ తెలిపారు. పంచదార దంత క్షయాన్ని కలిగించే అత్యంత కీలకమైన ఆహార పదార్దం. పంచదార పరిమాణానికి, దంత క్షయానికి మధ్య సంబంధం లేదని ఆ అధ్యయనం వెల్లడించింది. పంచదార పరిమాణంతో కాకుండా, విడతలు విడతలుగా పంచదార తినడానికి దంత క్షయానికి మధ్య సంబంధమున్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. పరిశీలకులు ఈ అధ్యయనాన్ని 31 సార్లు నిర్వహించారు. రాత్రి నిద్రపోవడానికి ముందు చక్కగా ఫ్లోరైడ్ టూత్ పేస్టు ద్వారా పళ్ళు తోముకోవడం దంత క్షయ నివారణకు అన్నిటి కంటే ఉత్తమమైన పద్ధతి.
News Posted: 27 February, 2009
|