రెహమాన్ కు డాక్టరేట్
చెన్నై: ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయుడు ఎ.ఆర్.రెహమాన్ కు మీడియా సైన్సెస్ లో గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్టు అణ్ణా యూనివర్సిటీ ప్రకటించింది. సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందిస్తున్న రెహమాన్ తోపాటు చంద్రయాన్-1 యాత్ర సూత్రధారి, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మయిల్ స్వామి అణ్ణాదురై, తమిళనాడు స్థానిక పరిపాలనా వ్యవహారాల శాఖ మంత్రి ఎం.కె.స్టాలిన్ కు కూడా గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేయనున్నారు. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరక్టర్ అణ్ణాదురైకి ఆలరిస్ కాజా(గౌరవ డాక్టరేట్), స్టాలిన్ కు ఆర్కిటెక్చర్, సోషల్ సైన్సెస్ లో గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్టు అణ్ణా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెల చివరి వారంలో జరిగే ప్రత్యేక స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ లను అందజేస్తారు. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్.అణ్ణాదురై శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక స్నాతకోత్సవాన్న నిర్వహిస్తున్నారు.
News Posted: 1 March, 2009
|