నైట్ షిఫ్టులతో ఊబకాయం
లండన్: నైట్ షిఫ్టుల మూలంగా ఊబకాయం వస్తుందని ఒక తాజా అధ్యయనం తెలయజేసింది. నైట్ షిఫ్టుల్లో పనిచేసే వేళల్లో శరీరానికి సంబంధించిన సహజ జీవప్రక్రియ మందగిస్తుంది. దాంతో శరీరంపై, గుండెపై ఒత్తిడి పెరిగి కార్డీయో వస్కులర్, మధుమేహ వ్యాధులు వచ్చే అవకాశముందని ఆ అధ్యయనం తెలిపింది.
రాత్రి పని వేళల్లో పనిచేసి, పగలు నిద్ర పోయేవారి శారీరక సహజ ధర్మంలో అపశ్రుతులు చోటు చేసుకుంటాయి. శరీరం తీసుకునే కేలరీలన ఖర్చు చేయడం బాగా తగ్గిపోతుంది. దాంతో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వస్తాయని ఆ అధ్యయనం తెలిపింది. 'సుదీర్ఘకాలం నైట్ షిఫ్టుల వలన శరీర బరువును నిర్ణయించే లెప్టిన్, ఇన్సులిన్, కార్టిసోల్ లాంటి పదార్ధాల నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో మధుమేహం, కార్డియోవస్కులర్ జబ్బులు, ఊబకాయం వచ్చే ప్రమాధం ఎక్కువ' అని ఆ అధ్యయన పరిశోధకుడు ఫ్రాంక్ షీర్ తెలిపారు.
హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 10 మంది వాలెంటీర్లను ఈ అధ్యనం కోసం ఎంపిక చేశారు. పది రోజుల పాటు నైట్ షిఫ్టుల చేసిన వాతావరణాన్ని వారిక కలిగించి పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ వాలెంటీర్లలో అయిదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ వాలెంటీర్లను పగటి పూట తిని నిద్రపోయేట్లు పరిశోధకులు చేశారు. ఆ సమయంలో వారి గుండె కొట్టుకునే రేటు, శారీరక ఉష్టాగ్రతలను పరిశోధకులు నిరంతరాయంగా గుర్తించారు. ఆ సమయంలో వాలెంటీర్ల జీవ ప్రక్రియ మందగించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. వత్తిడికి సంబంధించిన, హుషారుకు సంబంధించిన హార్మోన్ ల స్థాయిలు వారి శరీరాల్లో మారిన్టుల పరిశోధకులు గుర్తించారు. గతంలో మధుమేహ లక్షణాలు లేని ఇద్దరికి శరీరంలో ఆ లక్షణాలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రభావాలన్నిటినీ క్రోడీకరిస్తే ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం లక్షణాలు షిఫ్టులు చేసే ఉద్యోగుల్లో పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' జర్నల్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.
News Posted: 3 March, 2009
|