చిక్కిన 'వందేళ్ల' కప్పులు
టోక్యో: వందేళ్లు బతికిన వయోవృద్ధులకు వెండి గిన్నెలను బహూకరించి సత్కరించడం జపాన్ ప్రభుత్వ సంప్రదాయం. అయితే పొదుపు చర్యల్లో భాగంగా శతాయుషు వృద్ధులకు బహూకరించే వెండి గిన్నెల సైజును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఏడాది 1963లో వందేళ్ల వయోవృద్ధులు జపాన్ దేశంలో కేవలం 153 మాత్రమే ఉన్నారు. వయసు అతి వేగంగా పెరుగుతున్న దేశంగా పేరుపడ్డ జపాన్ లో వందేళ్లు దాటిన వారు 2008 నాటికి 19,769 మంది ఉన్నట్లు అంచనా.
వందేళ్ల నిండిన వారి సంఖ్య పెరగడంతో వెండి కప్పుల ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రభుత్వం పొదుపు చర్యల్ని చేపట్టింది. కప్పుల సైజు తగ్గించింది.కప్పు సైజును 10.5 నుండి 9 సెంటీమీటర్లకు ప్రభుత్వం తగ్గించింది.పరిమితమైన బడ్జెట్ తో ఏడాదికేడాది పెరుగుతున్న వందేళ్ళ వయోవృద్ధులకు వెండి గిన్నెలను అందించడం, అదే సమయంలో వెండి ధర కూడా విపరీతంగా పెరిపోవడంతో ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. ముందటి ఏడాది వందేళ్ల నిండిన వయోవృద్ధులకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న జాతీయ సెలవు దినం ప్రకటించి వెండి గిన్నెలతో సత్కరించి సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని జపాన్ జరుపుకుంటుంది. అయితే ఈ వెండి గిన్నెల పథకం ఏడాదికేడాది మరింత బరువెక్కుతోంది. ప్రస్తుతం ఒక్కొక్క గిన్నెకు 7-8 వేల రూపాయల ఖర్చవుతోంది. ప్రస్తుతం జపాన్ జనాభా 12.78 కోట్ల మందిలో దాదాపు 36,436 మంది శతాధిక వృద్ధులున్నారు.
News Posted: 4 March, 2009
|