హై హీల్స్ లో చైనా కుర్రాళ్లు
న్యూఢిల్లీ: చైనా మగవాళ్లు హై హీల్స్ చెప్పులను వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. తమ ప్రియ సహచరి వేసుకునే హై హీల్స్ జోళ్ల వల్ల కలిగే బాధను తాము కూడా అనుభవించేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రముఖ చైనా వెబ్ సైట్ వెల్లడించింది. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు 163 డాట్ కామ్ అనే చైనా వెబ్ సైట్ 3 వేల మంది నెటిజన్ల మనోగతాలను అధ్యయనం చేసింది. తమ ప్రియతమ సహచరుణుల పాదాలను బాధించే హై హీల్స్ జోళ్ళను తాము కూడా ధరించి వారి పట్ల తమకు గల ప్రేమ, అభిమానం, గౌరవాన్ని చాటేందుకు ప్రయత్నించామని వారు తెలిపారు.
'నేను నా భార్య హై హీల్డ్ షూలను వేసుకున్న ప్రతిసారి చాలా బాధపడుతుంటాను. అవి ఆమెను బాగా ఇబ్బందిపెడుతున్నట్లు నేను గుర్తించాను' అని దక్షిణ చైనా కు చెందిన గ్వాగ్సి ఝువాంగ్ తెలిపినట్లు చైనా వ్యూ డాట్ కామ్ వెల్లడించింది. 'నేను మా ఆవిడ అందాన్ని పొగుడుతుంటాను. అయితే ఆమె వేసుకునే షూ లను మాత్రం పొగడను' అని మరో నెటిజన్ తెలిపారు. 80 ల తర్వాత చైనా యువతరం తమ ప్రేయసి లేదా ప్రియమైన భార్యలతో కలసి మహిళా దినోత్సవం, వేలంటైన్స్ డే, క్రిస్మస్ లాంటి పండుగ సంబంరాల్లో పాల్గొనేందుకు ఇష్టపడతారని హాంగ్నియాంగ్ డాట్ కామ్ సర్వే వెల్లడించింది. పెళ్లి, ప్రేమ వ్యవహారాల విషయాలపై ఆన్ లైన్ సర్వేలో దాదాపు ఒక లక్ష మంది ప్రతిస్పందించారు. చాలా మంది మగవారు తమ ప్రియమైన సహచరణి కోసం పని నుండి వచ్చిన తర్వాత వండి పెట్టడం, పుట్టినరోజు, వేలంటైన్స్ డే లాంటి విశిష్టమైన సందర్భాల్లో వండిపెడుతుంటామని పలువురు చైనా మగవాళ్లు ఆన్ లైన్ సర్వేలో వెల్లడించారు.
News Posted: 9 March, 2009
|