అమ్మకానికి పెళ్లాం!
డన్: నిత్యం ఏదో ఒకదానికి సతాయిస్తూ, వేధించే భార్యతో వేగలేకపోతున్న ఒ బ్రిటీషు యువకుడు ఆమెను అమ్మకానికి పెట్టాడు. ఇందుకోసం పాత కార్లు, ఇళ్లు తదితర గృహోపకరణాల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రకటనలు ప్రచురించే ట్రేడ్-ఇట్ అనే పత్రికలో ఒ చిన్న అడ్వర్టయిజ్ మెంట్ కూడా ఇచ్చాడు. 'సతాయించే పెళ్లాం. పన్నుల్లేవు. అత్తగారు లేదు. పోషణ ఖర్చు ఎక్కువ. పల్లెటూరి మొద్దు!' ఇదీ గారీ బేట్స్(38)అనే ఆ వ్యక్తి ఇచ్చిన ప్రకటన. గ్లూసెస్టర్ షైర్ లో బిల్డర్ గా పనిచేస్తున్న బేట్స్ తన భార్య డోన్నా(40)టెలివిజన్ చూస్తూ తనను వేధించడం మొదలు పెట్టడంతో ఈ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏదో చిన్న కారణం చూపించి తనను సతాయిస్తోందని, తాను మాత్రం టివిలో వచ్చే చెత్త ప్రొగ్రాములు చూస్తుందని, అందుకే ామెను వదిలించుకోడానికి యాడ్ ఇవ్వాలనుకున్నానని బేట్స్ చెప్పాడు. దీనికి ఎవరూ స్పందించరని తాను అనుకున్నా, పదిమంది వరకూ ఫోన్ చేశారని, కేవలం సరదాకే ఆ ప్రకటన ఇచ్చినట్టు వారికి చెప్పానని తెలిపాడు. పేపర్లో ఆ ప్రకటన చూసిన తన భార్య మొదట్లో కోపగించుకున్నా, ఆ తరువాత అందులో హాస్యాన్ని గ్రహించిందని బేట్స్ చెప్పాడు.
News Posted: 13 March, 2009
|