'కిస్' థెరపీ గొ్డ్రాళ్ల వరం
వాషింగ్టన్: మహిళల వంధ్యత్వ నివారణ చికిత్సలో బ్రిటీష్ శాస్త్రవేత్తలు సరికొత్త పద్దతిని రూపొందించారు. వంధ్యత్వంతో బాధపడే మహిళలకు 'కిస్ పెప్టిన్' అనే హార్మోన్ ను ఇచ్చినట్లయితే వారిలో రుతుక్రమం నియంత్రితమవుతుంది. అదే సమయంలో వారిలో సెక్స్ హార్మోన్లు విడుదలవుతాయని లండన్ ఇంపీరియల్ కాలేజి డాక్టర్ వాల్జిత్ ధిల్లో అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ద్వారా సరికొత్త సంతాన సాఫల్య పద్ధతి అభివృద్ధి అయ్యిందని ఆ పరిశోధకులు తెలిపారు. సెక్స హార్మోన్లు తక్కువగా స్రవిస్తున్న మహిళలకు ఈ థిరపీ ఒక వరం లాంటిదని వారు తెలిపారు.
కెఐఎస్ఎస్-1 (కిస్-1) జన్యువు కిస్ పెప్టిన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ పునరుత్పత్తి కార్యకలాపాన్ని నియంత్రిస్తుంది. కిస్ పెప్టిన్ కార్యకలాపం సరిగా లేని మనుషులు జంతువులకు యవ్వనం రాదు. దాంతో వారిలో\వాటిలో సెక్టువల్ గా పరిపక్వత రాదు. సాధారణమైన స్త్రీలల్లో కూడా కిస్ పెప్టిన్ సెక్స్ హార్మోన్లను ఉద్దీపన చేస్తున్నట్లు డాక్టర్ వాల్జిత్ ధిల్లో, ఆయన సహచర పరిశోధక బృందం కనుగొంద. హార్మాన్ల తేడా వల్ల రుతుస్రావం నిలిచిపోయిన మహిళల్లో కిస్ పెప్టిన్ హార్మోన్ ప్రభావంపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. ఎంపిక చేసిన పది మంది మహిళలకు కిస్ పెప్టిన్ లేదా శాలైన్ ను ఎక్కించారు. ఆ తర్వాత వారి రక్తంలో లుటియనైజింగ్ హార్మోన్ (ఎల్ హెచ్), ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (ఎఫ్ ఎస్ హెచ్) అనే రెండు సెక్స్ హార్మోన్ల స్థాయిలను ఆ బృందం పరిశీలించింది. ఈ రెండు హార్మన్లు అండం విడుదల కావడానికి, సాఫల్యతకు ప్రధాన కారణం. ఎల్ హెచ్ హార్మోన్ 48 రెట్లు పెరగగా, ఎఫ్ ఎస్ హెచ్ హార్మోన్ 16 రెట్లు పెరిగినట్లు పరిశీలకులు గుర్తించారు. కిస్ పెప్టిన్లు సెక్స్ హార్మోన్లను ఉద్దీపన చేయగలవన్న విషయం తొలిసారిగా వెల్లడైంది. హర్రొగేట్ లో జరిగిన సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీ బిఈఎస్ వార్షిక సమావేశంలో ఈ అధ్యయన పత్రాన్ని ప్రకటించారు.
News Posted: 17 March, 2009
|