కూతుళ్ళపై తండ్రి అత్యాచారం!
ముంబై: సంపన్నుడిని కావాలనుకున్న ఆశతో తాంత్రిక విద్య మాయలో పడి ఒక కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిన ఉదంతం ఇది. ముంబై మీరా రోడ్ కు చెందిన ఒక వ్యాపారి తన ఇద్దరు కుమార్తెలలో పెద్దమ్మాయిపై 9 ఏళ్ళుగా అత్యాచారం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ధనికుడు కావడానికి ఆయనకు విలె పార్లెలో ఉండే ఒక తాంత్రికుడు అలా చేయవలసిందని సలహా ఇచ్చాడట. ఆయన భార్య కూడా ఈ విషయంలో ఆయనకు సాయం చేసిందని తెలుస్తున్నది. అయితే, మరింత కలచివేస్తున్న సంగతి ఏమిటంటే ఆ తాంత్రికుడే స్వయంగా ఆ వ్యక్తి చిన్న కుమార్తెపై అత్యాచారం చేయసాగడం. ఈ అవమానాలను ఇక భరించలేక ఆ కుమార్తలిద్దరూ తమ మామను, అమ్మమ్మను ఆశ్రయించి చివరకు బుధవారం పోలీసుల వద్ద ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. దీనితో మీరా రోడ్ పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు.
మీరా రోడ్ లో గోల్డెన్ నెస్ట్ భవనంలో నివసించే కిషోర్ చౌదరి అనే ఆ వాణిజ్యవేత్త ముంబైలో రేడియం ప్లేట్ ఎంబాసింగ్ వ్యాపారం చేస్తుండేవాడు. కాని వ్యాపారం సరిగ్గా సాగకపోతుండడంతో, అతను 2000లో విలె పార్లెలో ఉండే తాంత్రికుని సంప్రదించాడు. సంపన్నుడివి కావాలని కోరుకుంటే పెద్ద కుమార్తెతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవాలని అతనికి తాంత్రికుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. అప్పటి నుంచి చౌదరి ఆమెపై అత్యాచారం చేయసాగాడు. ఆమె వయస్సు ఇప్పుడు 21 సంవత్సరాలు.
తాంత్రికుడు ఐదు నెలల క్రితం చౌదరి చిన్న కుమార్తె 15 సంవత్సరాల యువతిపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. 'మేము ఐపిసి 376 సెక్షన్ కింద అత్యాచారం కేసు నమోదు చేసి తల్లిని, తండ్రిని, తాంత్రికుని అరెస్టు చేశాం. మేము వారిని గురువారం ఠాణె సెషన్స్ కోర్టులో హాజరు పరుస్తాం' అని మీరా రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ముకుంద్ మహాజన్ తెలియజేశారు.
News Posted: 19 March, 2009
|