ఫేస్ బుక్ పై 'తిరుగుబాటు'
శాన్ ప్రాన్సిస్కో: అతి పెద్ద ఆన్ లైన్ వినియోగదారుల తిరుగుబాటు వచ్చింది. కు వ్యతిరేకంగా 17 లక్షల మందికి పైగా వినియోగదారులున్నసోషల్ నెట్ వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్' కు వ్యతిరేకంగా దాని వినియోగదారులు తిరుగుబాటు చేశారు. ఫేస్ బుక్ సైట్ ఆకృతిని పూర్తిగా మార్చివేయడానికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం 'పిటిషన్ అగినెస్ట్ ది న్యూ ఫేస్ బుక్' అన్న పేరుతో ఒక పోల్ ను ఫేస్ గ్రూప్ నిర్వహించింది. దాదాపు 17.27394 లక్షల మంది వినియోగదారులు ఆ పోలింగ్ లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 75వేల మంది మాత్రమే ఫేస్ బుక్ కొత్త హోం పేజిని ఆమోదించారు.
ట్రిట్టర్ లాంటి మైక్రోబ్లాంగింగ్ సైట్లతో పోటీ పడే విధంగా, సైట్ పేజీలను మరింతగా అడ్వర్టైజ్ మెంట్ కు అనుకూలంగా ఉండే విధంగా ఫేస్ బుక్ గ్రూప్ సైట్ ను పునర్నిర్మించింది. తాము నిర్లక్ష్యం చేసే వారితో హోం పేజీని నింపారని, అదే సమయంలో వినియోగదారులు వినియోగించుకునే పలు అంశాలను ఫేస్ బుక్ గ్రూప్ తొలగించినట్లు కొత్త సైటు వ్యతిరేకులు చెబుతున్నారు. ఈ విమర్శను ఫేస్ బుక్ స్వీకరించింది. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యల్ని చేపట్టలేదు.
'ఫేస్ బుక్ పరిణామంలో ఈ కొత్త హోమ్ పేజి రూపాంతరం చెందింది. స్టేటస్ అప్ డేట్స్, ఫోటోలు, వీడియోలు, నోట్స్ ఇలా మరెన్నో అంశాలను అత్యంత సౌకర్యంవంతంగా వినియోగదారులకు ఉపకరించే విధంగా కొత్త రూపొందింది. మేము పలు కోణాల నుండి వస్తున్న విమర్శలను పరిశీలిస్తున్నాము. అయితే ప్రజలకు ఈ కొత్త హోం పేజి చాలా ఉపయోగపడుతుంది' అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
News Posted: 24 March, 2009
|