తప్పుల్ని గుర్తించే బ్రెయిన్ వేవ్స్
లండన్: మనం రోజువారి చేయబోతున్న తప్పిదాలను బ్రెయిన్ వేవ్స్ ముందుగానే గుర్తించగలవని ఒక తాజా అధ్యయనం తెలిపింది. ఆకస్మికంగా ఒకరి తలపై కొట్టడం లేదా కాఫీ కప్పును దొర్లించడం లాంటి విషయాలను సైతం ఒక ప్రత్యేకమైన బ్రెయిన్ వేవ్స్ ద్వారా గుర్తించగలమని ఆ అధ్యయనం వెల్లడించింది. ఒక వ్యక్తి తప్పు చేయడానికి కనీసం ఒక సెకను ముందస్తుగా అతని రెండు మెదడు భాగాల నుండి విడుదలయ్యే తరంగాలను విశ్లేషిండం ద్వారా గుర్తించవచ్చని ఆ అధ్యయనం తెలిపింది. ఈ పద్ధితితో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పని సులభతరం చేస్తుంది. అదే విధంగా హైపర్ యాక్టివిటీ రుగ్మతతో బాధపడుతున్న పిల్లలకు ఈ పద్దతి బాగా ఉపకరిస్తుంది.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకుట అలి మజాహెరీ ఈ అధ్యయనాన్ని చేపట్టారు. 'మెదడు బద్దకించినపుడు ఆల్ఫా, మ్యూ తరంగాలు వస్తుంటాయి. ఒక రూంలో కూర్చుని కళ్లు మూసుకున్న సమయంలో ఈ తరంగాలు వెలువడుతాయి. మన తల వెనుక భాగం నుండి ఒక పెద్ద ఆల్పా రిథమ్ వెలువడుతుంది. అయితే మనం కళ్లు తెరచి చూచినట్లయితే ఆ రిథమ్ వెంటనే ఆగిపోతుంది. అంటే కళ్లు తెరచిన వెంటనే మన న్యూరాన్స్ కంటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటాయి.' అని అలి తెలిపారు.
News Posted: 24 March, 2009
|