అపరిచితుల పెళ్లి మేలు!
లండన్: ఆరోగ్యవంతలైన పిల్లలు కలగాలంటే అపరిచితులు పెళ్లిచేసుకోవాలని ఒక తాజా అధ్యయనం తెలియజేస్తోంది. సమీప బంధువుల్లో గాని, కుటుంబంలో గాని, బాగా తెలిసినవారిని గాని పెళ్లి చేసుకుంటే వారి సంతానానికి జన్యుపరమైన లోపాలే కాకుండా, పలు రకాల ఇన్ ఫెక్షన్ల బారిన పడే అవకాశముంటుందని పరిశోధకులు తెలిపారు. గాంబియా, భారత దేశాల్లో విస్తరించిన కుటుంబాల లోపల జరిగే వివాహాలను ఈ పరిశోధకుల బృందం జన్యుపరంగా విశ్లేషించింది.
గాంబియన్ కుటుంబాల్లో టిబి లేదా హెపటైటిస్ బి లాంటి జబ్బులు అతి సమీప బంధు సమూహాల్లోని స్త్రీ-పురుషుల పెళ్లి బంధంలో జన్మించిన సంతానంలో కనుగొన్నామని ఆ అధ్యయనం తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అలాంటి సంతానానికి చెందిన తల్లిదండ్రుల జన్యువుల్లో వైవిధ్యత లేని కారణంగా ఇలాంటి లోపాలు తలెత్తాయని ఆ పరిశోధక బృందానికి సారధ్యం వహించే విలియం అమోస్ తెలిపారు. అయితే బారత దేశంలో కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లల విషయంలో ఇది నిజం కాకపోయినప్పటికీ, అలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడేందుకు జన్యు వైవిధ్యరాహిత్యం కూడా కారణం అవుతుందని అమోస్ తెలిపారు. ఈ అధ్యయనాన్ని 'బయోలజీ లెటర్స్' జర్నల్ ప్రచురించింది.
News Posted: 25 March, 2009
|