పఠనంతో ఒత్తిడికి చెక్
లండన్: మానసిక వత్తిడి తగ్గేందుకు సంగీతం సరైన మంత్రంగా ఇప్పటివరకు అందరు ఆమోదిస్తారు. అయితే ఒత్తిడితో ఉద్రక్తమైన నరాలు ఏదైనా పుస్తకాలు చదవడం ద్వారా వేగంగా ఉపశమిస్తాయని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. మానసిక వత్తిడి నుండి ఉపశమనం కలిగించేందుకు చదవడం చాల మెరుగైన పరిష్కారంగా ఆ అధ్యయనం వెల్లడిస్తోంది. ఆరు నిమిషాల సేపు చదవడం ద్వారా మానసిక ఒత్తడిలో మూడింట్లో రెండితలు తగ్గిపోగలదని ఆ అధ్యయనం తెలిపినట్లు ది డైలీ టెలిగ్రాఫ్ నివేదించింది.
చదవడం ద్వారా మనిషి మనసు చదివే విషయంపై మళ్లుతుంది. దాంతో అప్పటి దాకా మనిషి గుండె, కండరాలపై ఉన్న ఒత్తిడి సాహితీ ప్రపంచంపైకి మళ్లడంతో ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు తెలిపారు. 'ఒక పుస్తకంలోకి మనసు మళ్లడంతో అత్యున్నతమైన ఉపశాంతి దొరకుతుంది. ప్రపంచ ఆర్దిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వచ్చే మానసిక ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు పుస్తకాలు చదవడం వలన బాగా ఉపశమనం దొరకుతుంది. ఈ సంక్షోభ కాలంలో ఎదురయ్యే పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రతివాడు కోరుకుంటాడు' అని ఆ అధ్యయన పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ లూయిస్ తెలిపారు.
మానసిక వత్తిడి నుండి బయటపడేందుకు ఎలాంటి పుస్తకం చదవాలన్న దానితో సంబంధం లేదు. బాగా ఆసక్తికరంగా ఉండే పుస్తకాన్ని చదవడంలో నిమగ్నమైతే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. పుస్తకం చదివే సమయంలో మనం వాస్తవ ప్రపంచానికి దూరంగా పుస్తక రచయిత ఊహాలోకంలో విహరిస్తాము. మానసిక వత్తడి నుండి దూరం కావడమే కాదు, పుస్తకంలోని విషయం మన స్మృతి పథంలో చదివే సమయంలో మెదలుతుంటుంది. దాంతో మన సృజనాత్మకత పెరిగేందుకు దోహదపడుతుంది. దాంతో మన చైతన్య స్థితి సవరింపబడుతుంది.
News Posted: 30 March, 2009
|