త్వరలో వైరస్ బ్యాటరీలు
వాషింగ్టన్: బయోటెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. సింథటిక్ బయాలజీ పారిశ్రామికంగా పలు విజయాలను సాధించింది. మనిషికి హానికరమైన వైరస్ ల ద్వారా కార్లకు లేదా ఎలక్ట్రానిక వస్తువులకు విద్యుత్ శక్తిని అందించే వైరస్ బ్యాటరీలను రూపొందించినట్లు పరిశోధకులు తెలియజేశారు. జన్యుపరంగా రూపొందించిన ప్రయోగాత్మక వైరస్ లకు లిథియం నియాన్ బ్యాటరీల్లో వలె రుణ, ధన విద్యుత్ ధృవాలను మసాచ్యూట్స్ శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసినట్లు 'సైన్స్' జర్నల్ ప్రచురించింది.
'ఈ కొత్త రకం వైరస్ బ్యాటరీలు హైబ్రిడ్ కార్లలో అమర్చిన రిచార్జబుల్ బ్యాటరీల వలె శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ వైరస్ బ్యాటరీలను పలు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో సైతం వినియోగించవచ్చు' అని ఆ పరిశోధక బృందం నాయకుడు అంజిలా బేల్షర్ తెలిపారు. వాస్తవంలో, ఈ బ్యాటరీలను చాలా చౌకగా, పర్యావరణానికి ప్రమాందం లేకుండా సాధారణ ఉష్టోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద రూపొందించవచ్చని ఆ బృందం తెలిపింది. వీటిని రూపొందించేందుకు ఎలాంటి ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించ వలసిన అవసరం లేదు. వైరస్ బ్యాటరీలకు వినియోగించే పదార్ధాలు విషపూరితమైనవి కావు.
News Posted: 2 April, 2009
|