లోక్ సభకు 'పాలిష్'!
ముంబాయి: రాంసింగ్ షిరాస్(35) ముంబాయిలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర బూట్ పాలిష్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పార్లమెంటులో అడుగుపెట్టాలని ఎన్నాళ్లనుండో కలలు కంటున్నాడు. ఆ కలను నిజం చేయాలని మళ్లీ అనుకున్నాడు. అనుకోవడమే తడవుగా కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గంలో నామినేషన్ వేసి, తన ఆస్తిపాస్తుల విలువ ఆరు లక్షల రూపాయలని అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు. విశేషం ఏమిటంటే, తనకు రైలింజన్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించాలని రాంసింగ్ అధికారులను అభ్యర్ధించడం. 'జీవితంలో ఒకసారైనా ఎంపి కావాలనుకుంటున్నాను' అని విలేఖరులకు చెప్పాడు. అయితే ఒక్కసారిగా పార్లమెంటుకు ఎందుకు? 'కార్పొరేషన్ ఎన్నికల్లోనో, అసెంబ్లీ ఎన్నికల్లోనో పళ్లు రాలగొట్టించుకోవచ్చు కదా?' అని అడిగితే, ప్రజాసేవ చేయాలంటే ఒక్క ఎంపి వల్లే అవుతుందని, అందుకు అవసరమైన నిధులు ఎంపికి ెప్పుడూ అందుబాటులో ఉంటాయని ్తడు వివరణ ఇచ్చాడు.
ఇక వాస్తవానికి వస్తే షిరాస్ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ అభ్యర్ధి వసంత్ డాఖరే, శివసేన సిట్టింగ్ ఎంపి ఆనంద్ పరాంజపె ఈ పాలిష్ వాలా ప్రత్యర్ధులు! ఆ ఇద్దరితో వ్యక్తిగతంగా తనకు పరిచయం ఉందని చిరునవ్వుతో చెప్పాడు షిరాస్. ఉత్తర మహారాష్ట్ర జల్ గాఁవ్ కు చెందిన రాంసింగ్ షిరాస్ గత 25 సంవత్సరాలుగా పొరుగునే వున్న ఉల్హాస్ నగర్ లో నివాసముంటున్నాడు. ఇక ఎన్నికలు అతడికి కొత్తేమీ కాదు. 2004లో లోక్ సభకు పోటీచేసి ఓడిపాయినా, 4,000 ఓట్లు సంపాదించాడు.
News Posted: 11 April, 2009
|