ఖాళీ కడుపుతోనే షేవింగ్
మ్యూనిచ్: ఉదయం అల్పాహారం తీసుకనేందుకు ముందుగా షేవింగ్ చేసుకుంటే ముఖానికి గాయాలు కావడం లేదా తెగిపోవడం జరగదని జర్మన్ బాషలోని చర్మ్ సౌందర్య వెబ్ సైట్ తెలియ జేసింది. పలు కాస్మటిక్స్, హెల్త్ కేర్ సంస్థలు సంయుక్తంగా ఈ వెబ్ సైట్ ను నిర్వహస్తున్నాయి. మనం ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో జీర్ణమవుతున్న సందర్భంలో రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ముఖం, మెడ ప్రాంతాల్లోని చర్మం కింద ఉన్న ధమనుల్లో (arteries) రక్త ప్రసారం పెరగుతుంది. అందువలన తిన్న తర్వాత షేవింగ్ చేసుకోవడం వలన చర్మం తెగే ప్రమాదముంటుంది. దాంతోపాటు, షవింగ్ చేసుకునేందుకు ముఖం మీద వెంట్రుకల్ని బాగా తడపాలి. స్పాంజ్ లా వెంట్రుకలు కూడా నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. దాంతో షేవింగ్ చాలా సులువవుతుందని ఆ వెబ్ సైట్ పేర్కొంది. అదే విధంగా వెంట్రుకలు అతికా తడవకుండా ఉండేందుకు స్నానానికి ముందు షేవింగ్ చేసుకోవడం చాలా మంచిది.
News Posted: 16 April, 2009
|