టీవీ చూస్తూనే సర్ఫింగ్
న్యూయార్క్: మీకిష్టమైన సినిమాగాని, టీవీ సీరియల్ నిగాని చూస్తూ ఈమెయిల్ ను పరిశీలించే సౌకర్యముంటే ఎంత బావుటుందో ఊహించుకోండి. అలాంటి సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులోకి రాబోతోంది. గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థను కలిగిన సెట్-టాప్ బాక్స్ లను మోటరోలా కంపెనీ త్వరలో తయారు చేయనుంది. స్థూలంగా చెప్పాలంటే, వినియోగదారులు ఒక ఇంటర్నెట్ తో అనుసంధానించే కేబుల్ బాక్స్ తో సహా, వెబ్ సర్ఫింగ్ కోసం ఒక సెట్-టాప్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.
జి1 రకం మొబైల్ పరికరాల కోసం గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ వ్యవస్థను ప్రధానంగా రూపొందించడం జరిగింది. అయితే ఆ సాంకేతిక వ్యవస్థ సెట్ టాప్ బాక్స్ లోకి దూరింది. సెట్ టాప్ బాక్స్ ను ఏయు బాక్స్ అని మోటారోలా నామకరణం చేసింది. జపాన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కెడిడిఐ సంస్థ కోసం మోటారోలా ఈ పరికరాన్ని రూపొందించింది. దీని ద్వారా డివిడిలను, సిడిలను పనిచేయించవచ్చు, మ్యూజిక్, వీడియా కార్యక్రమాలను మొబైల్ ఫోనుల్లోకి మార్చుకోవచ్చు. పలు రకాల ఫైళ్లను ఇందులో దాచొచ్చు.
ఓపెన్ ఎంబడెడ్ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ అనే జపాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కూడా ఈ ఆండ్రాయిడ్ పవర్ బాక్స్ ను వినియోగిస్తోంది. ఈ సంస్థ తన పలు రకాల పరికరాల్లో లైనక్స్ ఆధారిత ఓఎస్ ను మాత్రమే వినియోగించాలని చూస్తోంది. ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విఓఐపి ఫోన్లు, టీవిల్లాంటి పలు రకాల ఎలక్ట్రానక్ వస్తువుల మాతృకలను సిఈఏటిఈసి షోలో ఈ కంపెనీ ప్రదర్శించింది.
News Posted: 17 April, 2009
|