ఆరోగ్యమే మహాభాగ్యం
సింగపూర్: ప్రపంచ ఆర్ధిక సంక్షోభ కాలంలో అతిగా స్పందించి ఆరోగ్యాలు పాడుచేసుకోకుండా ఉండే వ్యూహాన్ని ఆసియా-పసిఫిక్ సంపన్నులు అనుసరిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. ధన సంపద కంటే ఆరోగ్య సంపద చాలా ముఖ్యమని అత్యధిక ఆసియా సంపన్నులు భావిస్తున్నారని తెలుస్తోంది. డబ్బు సంపాదనపై కేంద్రీరణ తగ్గించి, కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సంక్షోభ కాలంలో మానసిక ఉద్రిక్తతలకు గురై వ్యాపారాన్ని పెంపొందించి డబ్బు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమమని వారు భావిస్తున్నారు.
ప్రముఖ క్రెడిట్ కార్డుల సంస్థ 'వీసా' 4 వేల మందికి పైగా ఆసియా ఫసిఫిక్ ప్రాంత సంపన్నలను అధ్యయనం చేసింది. ఈ రెండేళ్ల కాలం పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వీసా సంస్థ అధ్యయనం చేసిన వారిలో 91 శాతం మంది తెలిపారు. మూడు త్రైమాసిసాల్లో వారు నెలకు ఒక్కసారి మాత్రమే వ్యాయామం చేసినట్లు తెలిపారు. ఆసియా పసిఫిక్ రీజియన్ సంపన్నుల్లో 80 శాతం మంది డబ్బును ఆదా చేయడం, పనికి-జీవితానికి మధ్య సమతుల్యత సాధించడం, సంపద పెంపొందించుకోవడంపై రాబోయే రెండేళ్ళలో కేంద్రీకరించనున్నట్లు తెలిపారు.
'తీరికలేని వ్యాపార లావాదేవీల్లో మునిగి ఉన్నప్పటికీ వాళ్లు ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయడం లేదు. తమ చుట్టూ ఉన్న వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించడంలోను, పని-జీవితాల సమతుల్యతను పాటించడంలోను బాగా శ్రద్ధ వహిస్తున్నారు' అని వీసా ప్రాంతీయ అధినేత జేమ్స్ లిమ్ తెలిపారు. ఉన్నత ఆదాయవర్గాల్లోని పై అంతస్తుకు చెందిన 20-40 శాతం కుటుంబాలు ప్రతి ఎనిమిది దేశాలు, ద్వీపాల నుండి ఎంపిక చేసి అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, చైనా, భారత దేశాలు కూడా ఉన్నాయి. తీరిక వేళల్లో కుటుంబంతో గడపడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎంపిక చేసిన సంపన్నుల్లో 92 శాతం మంది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. స్నేహితులతో గడపడానికి కూడా తగు ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆధ్యయనంలో వెల్లడైంది.
News Posted: 17 April, 2009
|