'ఐష్ బొమ్మ గుర్తు కావాలి'
చెన్నై : వెండితెరపై ఆమె కనిపిస్తేనే చాలు బాక్సాఫీసులో కోట్లకు కోట్లు డబ్బుల వర్షం కురుస్తుంది. మరి ఆకట్టుకునే ఆమె చిత్రం బ్యాలట్ పోరులో విజయాన్ని సాధించకుండా ఉంటుందా? ఐశ్వర్యా రాయ్ రాజకీయ క్షేత్రంలో తన ఆకర్షణ శక్తిని ఇంకా పరీక్షించుకోవలసి ఉండగా తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకుంటున్న ఒక అభ్యర్థి ఆ అందాల రాణి తన ఎన్నికల చిహ్నంగా ఉంటే ఓట్ల వర్షం కురియగలదని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, తన ఎన్నికల చిహ్నంగా ఐశ్వర్య బొమ్మ కావాలన్న మణిదన్ వింత అభ్యర్థన రిటర్నింగ్ అధికారి, వెల్లూరు జిల్లా కలెక్టర్ సి. రాజేంద్రన్ కు నచ్చలేదు. 'మీరు అభిషేక్ బచ్చన్ ను అడిగితే మంచిది' అని ఆ అధికారి ముందు చమత్కారంగా సలహా ఇచ్చినా సాంకేతిక కారణాలపై ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
అభ్యర్థుల జాబితాలో రిజిస్టరైన, గుర్తింపు ఉన్న పార్టీల ప్రతినిధులు, బడా నాయకులతో కలసి చేటు చేసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు పాపులర్ చిహ్నాలతో లేదా కనీసం సామాన్యులని తేలికగా ఆకట్టుకునే చిహ్నాలతో తమ గుర్తింపు సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు. అటువంటి వారిలో చెన్నై సౌత్ లోక్ సభ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న జె.ఎస్. మహాలింగం ఒకరు. ఆయన తాను కోరుకున్న ఐస్ క్రీమ్, కొవ్వొత్తి లేదా బెలూన్ గుర్తుకు బదులు తనకు అలమారా గుర్తు కేటాయించినందుకు అసంతృప్తి చెందారు. 'కొవ్వొత్తి లేదా బెలూన్ వంటి వస్తువులను నా ప్రచారం సమయంలో ప్రదర్శిస్తూ ఆ గుర్తులు జనాన్ని ఆకట్టుకునేలా చేయగలను. కాని ఆ చిహ్నాలకు పోటీ ముమ్మరంగా ఉన్నందున నాకు చివరకు అలమారా గుర్తు కేటాయించారు. నా ప్రచారంలో అలామారాను నేను ఎలా ప్రదర్శించగలను' అని మహాలింగం వాపోయారు.
News Posted: 5 May, 2009
|