పొడుగువాళ్ళే గట్టివాళ్ళు
మెల్ బోర్న్ : మన లెక్క ప్రకారం పొట్టి వాళ్ళు మహా గట్టి వాళ్ళు. పొట్టి వాడికి పుట్టెడు బుద్దులని మన అమ్మమ్మలు పొంగిపోయేవారు. కోర్టులో కేసులయితే పొట్టి ప్లీడరును పెట్టుకొడానికే మన తాత ముత్తాతలు మొగ్గు చూపేవారు. కానీ పొట్టి వాళ్ళ కంటే డబ్బు సంపాదనలో పొడుగువాళ్ళే గట్టివాళ్ళని ఆస్ట్రేలియా పరిశోధకులు కొత్తగా తేల్చి చెప్పారు. రివటలా, గెడకర్రలా, తాడిచెట్టులా ఎదిగిపోయాడని మనమెన్ని అనుకున్నా పొడుగు వాళ్ళే పొట్టి వాళ్ళ కంటే తెలివైన వాళ్ళని ఢంకా భజాయించి మరీ ప్రకటించారు. అంతేకాదు పొడుగ్గా ఉండే వాళ్ళే శక్తిమంతులు, ధృఢమైన వారని మరీ మరీ చెబుతున్నారు. మామూలు సైజు వారి కంటే అయిదు సెంటీమీటర్లు అదనంగా పొడుగెదిగిన వాళ్ళు సంవత్సరానికి వెయ్యి ఆస్ట్రేలియన్ డాలర్లు అదనంగా సంపాదించగలిగారని వీరి పరిశోధనలో తేలిపోయింది.
News Posted: 15 July, 2009
|