షారూక్ ఖాన్ 'ప్రయాణం'!
న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ నటుడు షారూక్ ఖాన్ జీవన విధానం, పర్యటనలు ఒక 'రియాలిటీ షో'గా ప్రేక్షకులకు త్వరలో కనువిందు చేయనుంది. ఎక్కడకు వెళితే అక్కడ అభిమానులతో షారూక్ ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలాంటిది ఆయన వెంట డిస్కవరీ ట్రావెల్, లివింగ్ టీవీ ఛానల్ బృందం నీడలా వెంబడించింది. ప్రపంచంలో పర్యటనల గురించి కార్యక్రమాలు ప్రసారం చేసే ట్రావెల్ ఛానల్ గా పేరు పొందిన ఈ ఛానల్ సిబ్బంది.. దక్షిణ ఆఫ్రికా, అమెరికా, లండన్, ముంబయిల్లో షారూక్ 'ప్రయాణం'లో వెన్నంటి అనుసరించారు.
దీన్ని ఎప్పుడు ప్రసారం చేయాలనే విషయం ఇంకా నిర్థారించలేదని డిస్కవరీ - ఇండియా ప్రతినిధి రాహుల్ జోహ్రీ తెలిపారు. మొత్తంమ్మీద వచ్చే ఏడాదిలోగా ప్రసారం ఉంటుందన్నారు. ఇటువంటి ప్రసారాలకు ఇంతవరకు ఏ తార కూడా ఒప్పుకోలేదు. ప్రస్తుత నిర్మాణ కార్యక్రమాల్లో షారూక్ సంస్థ రెడ్ చిల్లీస్ కూడా భాగస్వామిగా ఉంది. దీంతో ఈ రియాల్టీ షో కాస్తా షారూక్ సొంత 'ప్రయాణం'గా మారే అవకాశం ఉంది.
News Posted: 30 July, 2009
|