ఈనాటి కులం ఏనాటిదో! హైదరాబాద్ : భారతీయ సమాజంలో కీలక భూమిక పోషిస్తున్న కులం.. భారతీయ సామాజిక జీవనం తెగలుగా ఉన్నప్పటి నుంచే ఉందని ఒక అధ్యయనంలో తేలింది. 13 రాష్ట్రాలకు చెందిన ఆరు భాషా కుటుంబాలు, గిరిజన తెగలకు చెందిన జన్యువులను పరిశోధించిన తరువాత ఈ అంశాన్ని గుర్తించినట్టు హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు తమ సమాచారంతో కూడిన వ్యాసం 'నేచర్' పత్రికలో ప్రచురితమైదని శాస్త్రవేత్తలు కె.త్యాగరాజ్, వీణా కే పట్నాయక్, లాల్జీసింగ్ వివరించారు. ఆర్యుల రాకకన్నా ముందు నుంచే సమాజంలో కులం ఉందని వీరు గుర్తించారు. దేశంలో కుల భావనను బ్రిటిషర్లు సమాజంలో దృఢత్వం చేశారన్న వాదనలో పసలేదని వారు వివరించారు. ఉపఖండానికి ఇతర దేశాలతో సంబంధాలు లేని కాలంలో... ప్రజలు ఆదిమ తరగతులుగా జీవిస్తున్న తరుణంలోనే కులానికి పునాది ఏర్పడిందని తెలిపారు. తరాలు మారే కొద్దీ జన్యువుల్లో ఉత్పర్తి వర్తనాలు (ఫౌండర్ ఎఫెక్ట్) పెరిగి జన్యు వ్యాధులు విస్తరించేందుకు దారి తీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిస్టిక్ పైబ్రోసిన్, సికిల్ సెల్ ఎనీమియా వంటి జన్యు వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
News Posted: 25 September, 2009
|