పనిలేకుండా జీతం! దుబాయి : నమ్మండి... నమ్మకపోండి... కువైట్ లో కొత్తగా పట్టభద్రులైన యువతను కంపెనీలు ఉద్యోగాలలోకి నియమించుకుని ఏ పనీ చేయకుండానే ఇంటిలోనే ఉంటున్నందుకు జీతాలు చెల్లిస్తున్నాయి. ఏ కంపెనీ అయినా తన సిబ్బందిలో 30 శాతం కువైటీలను కలిగి ఉండాలనే నిబంధనను అమలుచేయాడానికి ప్రైవేట్ రంగంలో అర్హులైన కువైటీ యువజనులను ఎంపిక చేస్తున్నారు. కంపెనీలు అలా చేయని పక్షంలో ప్రభుత్వానికి అధికంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. అందువల్ల తమకు అవసరం లేకపోయినప్పటికీ కంపెనీలు కువైటీలను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. ఏ విధులూ నిర్వర్తించకుండా ఇంటిలోనే ఖాళీగా కూర్చుంటున్నందుకు వారు జీతం అందుకుంటున్నారు. ఈ ఉద్యోగాలను 'ఘోస్ట్ జాబ్స్' (దెయ్యం ఉద్యోగాలు)గా పేర్కొంటున్నారని 'కువైట్ టైమ్స్' పత్రిక తెలియజేసింది. కొంతైనా ఉద్యోగానుభవం సంపాదించాలని ఆకాంక్షించే యువ కువైటీలకు ఈ ఉద్యోగాలు తీవ్ర నిస్పృహను కలిగిస్తున్నాయని పత్రిక పేర్కొంది. ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగుతున్న యువకులు కూడా వారిలో ఉన్నారు. (అంటే వాస్తవానికి పని చేయకుండానే నియుక్తులైనవారి కేసులు ఇవి.) అయితే, హసన్ అనే వ్యక్తిది ఇందుకు పూర్తిగా భిన్నమైన కేసు. ఈ విధానం వల్ల ప్రభుత్వం విదేశీ శ్రామిక శక్తిపై ఆధాపడవలసి వస్తున్నదని పత్రిక పేర్కొంది. 'సొంత దేశీయ శ్రామిక శక్తి నిరుపయోగంగా ఉండిపోతున్నందున ఈ దేశ ఆర్థిక వ్యవస్థ విదేశీ శ్రామిక శక్తి లేకుండా మనగలుగుతుందా' అని పత్రిక ప్రశ్నించింది.
News Posted: 29 September, 2009
|