భారత్ కు 'తీపి' రోగం మాన్ ట్రయల్ : భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎస్) 2వ ప్రపంచ మధుమేహ సమ్మేళనం హెచ్చరించింది. ఐడీఎఫ్ నివేదిక ప్రకారం 5.8 కోట్ల మందితో భారత్ మొదటి స్థానంలో ఉంది. 4.32 కోట్లతో చైనా, 2.68 కోట్ల మంది మధుమేహులతో అమెరికా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 2010 నాటికి భారత్ లో మధుమేహుల సంఖ్య 5.87 కోట్లకు చేరుతుంది. వయోజన జనాభాలో 7 శాతంగా ఉన్న మధుమేహ పీడితుల సంఖ్య 2030 నాటికి 8.4 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2010లోగా ఏటా 200 కోట్ల డాలర్లకు పైగా భారత్ వ్యయం చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మందికి మధుమేహం ఉంది. అంటే ప్రపంచ జనాభాలో 7 శాతం మంది తీపి రోగులేనన్నమాట!
వ్యక్తిగతంగానూ, ప్రభుత్వ పరంగా ఈ వ్యాధి ఆర్థిక భారాన్ని మోపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2010లో మొత్తం ఆరోగ్యరంగానికి చేసే వ్యయంలో 11.6 శాతం మధుమేహానికే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. 'తీపి' రోగం విస్తరణ గురించి చెబుతూ, 2007లో 70 లక్షలు నమోదైన కొత్త కేసులు ఈ ఏడాది కోటికి చేరాయని ఐడీ ఎఫ్ తెలిపింది.
News Posted: 21 October, 2009
|