పిల్లల కోసం 15 పెళ్లిళ్లు అమ్రోహా (యుపి) : గడచిన నాలుగు దశాబ్దాలలో 15 పర్యాయాలు పెళ్లి పీటల మీద కూర్చున్న 65 సంవత్సరాల అబ్దులు వహీద్ సంతానం పొందాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికి 16వ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు.అబ్దుల్ వహీద్ ఉత్తర ప్రదేశ్ లోని జ్యోతిబా ఫూలే నగర్ జిల్లా రాయిపూర్ కలాన్ గ్రామంలో ఒక సన్నకారు రైతు. అతను ఇప్పటికి 15 సార్లు వివాహం చేసుకున్నాడు. కాని అతని భార్యలలో ఒక్కరి వల్ల కూడా అతని సంతాన కాంక్ష తీరలేదు. అయినా అతనిలో ఆశలు పోలేదు. 16వ సారి పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటున్నాడు.
1960లో వహీద్ మొదటిసారిగా దిండోలా ప్రాంతానికి చెందిన నఫీసాను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తరువాత ఆమె మృతి చెందింది. అప్పటి నుంచి క్రితం సంవత్సరం వరకు మధ్య మధ్యలో విరామంతో అతను పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు. కాగా, 'సచ్ కా సామ్నా' వంటి టెలివిజన్ షోలో పాల్గొనడం తనకు ఇష్టమేనని, తన అభిప్రాయాలు పంచుకోవడానికి తాను వెనుకాడబోనని అబ్దుల్ వహీద్ చెప్పాడు.
News Posted: 9 November, 2009
|