సెల్వం పెట్టిన కేసు చెన్నై : ఇదో చిత్రమైన కేసు. మనిషి కుక్కను కరచిన వార్తలాంటిది. ఔను మరి మాజీ భర్తను భరణం ఇమ్మన్న భార్యల కథల కోకోల్లలుగా ఉంటాయి మరి. ఇది రివర్స్ కేసు. విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన మాజీ భార్య నుంచి పాతిక లక్షలు నష్ట పరిహారం ఇప్పించమని ఓ వ్యక్తి ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పేరు మోసిన విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా ఉన్న తన మాజీ భార్య నుంచి ఈ మొత్తాన్ని ఇప్పించి తనను ఆదుకోవాలని ఓ 43యేళ్ల సివిల్ ఇంజనీరు కేసు దాఖలు చేసాడు. విడాకుల కోసం జరిగిన కేసు కోసం తాను కువైట్ లో మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని పొగొట్టుకున్నానని, కేసు కోసం, పిల్లలను సాకడానకి మొత్తం తాను దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోయిందని తన పిటీషన్ లో కలైసెల్వన్ పేర్కొన్నాడు.
తమకు 1997లో వివాహం జరిగిందని, అప్పుడు తాను కువైట్ లో ఉద్యోగం చేస్తున్నానని, తన భార్య నిరుద్యోగని వివరించాడు. పెళ్ళయిన తరువాత తన జీవితన సర్వనాశనమైపోయిందని వాపోయాడు. ఈ రోజు తాను వీధిలో పడితే తన మాజీ భార్య మలార్ మాత్రం చక్కగా ఉద్యోగం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నాడు. తన కేసును న్యాయస్థానం ఆమోదించిందని, విచారణను డిసెంబర్ 15 వ తేదీకి వాయిదా వేసిందని చెప్పాడు. పెళ్ళయిన సంవత్సరానికి ఈ దంపతులు విడిపోయారు. 2002 లో మలార్విజి, కలైసెల్వమ్ విడాకులకు దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి 2006 వరకూ కేసుకోసం ఇరవై సార్లు ఇండియా వచ్చానని, దాంతో కువైట్ లో ఉద్యోగం పోగొట్టుకున్నానని చెప్పాడు. మాజీ భార్య, అతని అత్తింటివారు కలైసెల్వం పై వరకట్న వేధింపు కేసు కూడా వేశారు. దాంతో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చిందని తెలిపాడు. గత యేడాది తమకు విడాకులు మంజూరయ్యాయని, ఉన్న ఒక పిల్లాడి సంరక్షణ తనకే అప్పగించారని వివరించాడు. ఈ వ్యవహారంతో తాను ఆర్ధికంగా చితికిపోయానని, రోడ్లపై మిగిలానని కలై సెల్వం ఆవేదనతో చెప్పాడు.
News Posted: 21 November, 2009
|