లియో రిసార్ట్ లో న్యూఇయర్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/lio.jpg' align='center' alt=''>
హైద్రాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శామిర్ పేటలోని లియా రిసార్ట్ లో శుక్రవారం రాత్రి సన్నాహాలు నిర్వహించారు. కొత్త సంవతర్సం వేడుకలను, దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే విషయాన్ని నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకులు చక్రి, డిజె సుఖేష్, రియో రిసార్ట్ బిజినెస్ డవలప్ మెంట్ డైరెక్టర్ రఘురామరాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు.
చక్రి మాట్లాడుతూ, తన తొమ్మిదేళ్ల సినీ కెరీర్ లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నానని చెప్పారు. ఈ రిసార్ట్ ను చూసిన తర్వాత ఇక్కడకు వచ్చే వారు తప్పకుండా సంగీతాభిమానులే అయి ఉంటారని భావించి పాడబోతున్నానని అన్నారు. తనతో పాటు నటీమణులు శ్రద్ధాదాస్, నవనీత్ కౌర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారనీ చెప్పారు. నగరవాసులకు తప్పనిసరిగా కొత్త అనుభూతులను పంచుతామన్నారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ను ఇక్కడ ప్రారంభించబోతున్నట్టు లియోనియో డైరెక్టర్లు తెలపారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఇంతవరకూ నగరంలో ఎవరూ చేయని రీతిలో ఒకే రిసార్ట్ లో విభిన్నమైన ప్రదేశాల్లో ప్రత్యేకమైన వినోదాన్ని అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల కోసం కాంబో పాస్ లు ఇస్తామనీ, ఈ పాస్ లతో మూడు లేదా రెండు కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుందనీ చెప్పారు. ఒక్కో జంటకు రూ3,300 వసూలు చేస్తామని చెప్పారు.
News Posted: 19 December, 2009
|