నికోలా ఫారియాకు క్రౌన్

హైదరాబాద్ : పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా సౌత్-2010 కిరీటాన్ని కన్నడ సుందరి నికోల్ ఫారియా సొంతం చేసుకుంది. హైటెక్స్ లోని హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం రాత్రి పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా సౌత్-2010 ఫైనల్స్ అట్టహాసంగా జరిగిగాయి. ఫైనల్ కు చేరిన 11 మందిలో ఐదుగురు మలి విడత రౌండ్ కు అర్హత సాధించారు. ఫైనల్స్ లో నికోల్ ఫారియా విజేతగా నిలువగా, హైదరాబాదీ అమ్మాయి క్రితాకా బాబు ఫస్ట్ రన్నరప్ గా, మంగుళూరు అమ్మాయి పూజా హెగ్డే సెకెండ్ రన్నరప్ గా నిలిచారు.
రెండున్నర గంటల పాటు జరిగిన ఈ ఫైనల్స్ లో భాగంగా టాలీవుడ్ కథానాయికలు పూనం కౌర్, కామ్న జెఠ్మలానీ, గీతిక, బిందుమాధవి తదితరులు తమ నృత్యాలతో అలరించారు. ఫెమినా మిస్ ఇండియా-2009 పార్వతీ ఒమన్ కుట్టన్, సిద్దార్ధ మీనన్ వ్యాఖ్యాతలుగా వ్యవహిరించారు. ఫైనల్స్ న్యాయ నిర్ణేతలుగా మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్, ఫ్యాషన్ డిజైనర్లు మాలిిని, రెహెనా, సినీనటులు జగపతిబాబు, ఇలియానా, హన్సిక వ్యవహరించారు. అందాల భామల దుస్తులను హైదారాబాదీ డిజైనర్ శ్రవణ్ కుమార్ డిజైన్ చేశారు. పర్యాటక కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News Posted: 24 December, 2009
|