రేపటి ఉద్యోగానికి అర్హత న్యూఢిల్లీ : ఎవరైనా పెరిగి పెద్దవారవుతున్నప్పుడు వారు ఆకాంక్షించేదేమిటి? పది సంవత్సరాల క్రితమైతే బాల, బాలికలు 'ఇంజనీర్'ను లేదా 'డాక్టర్'ను లేదా 'కంప్యూటర్ అనలిస్ట్'ను కావాలనుకుంటున్నామని జవాబు ఇస్తుండేవారు. ఇది కొంత వరకు మెరుగు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం గురించి కనీసం ఆలోచిస్తున్నారనుకోవచ్చు. స్వాతంత్ర్యానంతరం 1991 వరకు గడచిన దశాబ్దాలలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎలా అయినా ప్రభుత్వోద్యోగాన్ని సంపాదించాలని ఆకాంక్షిస్తుండేవారు. ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నప్పటికి సదరు అభ్యర్థికి ప్రభుత్వంలో లభించేది గుమాస్తా (క్లర్క్) ఉద్యోగమే. అయినా అప్పటి వారు ఆ విషయం పట్టించుకునేవారు కాదు.
ఈ రోజుల్లోనైతే ఆ ప్రశ్నకు 'బిజినెస్ ప్రాసెస్ అనలిస్ట్' ఉద్యోగం నుంచి రకరకాల సమాధానాలు రావచ్చు. 'ఎకోటూరిజం ట్రావెల్ గైడ్' లేదా 'గేమ్ డెవలపర్' లేదా చివరకు 'మసాజ్ థెరపిస్ట్' అయినా ఫర్వాలేదనే సమాధానాలు రావచ్చు. ప్రపంచం ఎంతో మారిపోయింది. ఫోర్డిజం, ఫ్యాక్టరీ దోపిడీ నుంచి 'పెద్ద మనుషుల పెట్టుబడిదారి తత్వం' వరకు, ఇంకా థామస్ ఫ్రైడ్ మాన్ పేర్కొన్నట్లుగా 'ప్రపంచీకరణ 3.0' వరకు ప్రపంచం పురోగమించింది. 1991 దరిమిలా ఈ విప్లవంలో ఒక భాగస్వామిగా ఉంటున్న ఇండియా ఇటీవలి కాలంలో ఇందుకు స్ఫూర్తిదాతగా కూడా ఉండసాగింది.
'బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్, రూపర్ట్ ముర్డోచ్, వారెన్ బఫెట్ వారసులుగా నవ తరం రోల్ మోడల్స్ ను ఇండియా అందించబోతున్నది' అని ఒక ఆర్థిక వేత్త జోస్యం చెప్పారు. ఏమైనా ఆధునిక భారత రిపబ్లిక్ 60వ సంవత్సరంలో అలా చెప్పడం తక్కువ చేయడమే కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికపరంగా, సామాజిక పరంగా విస్తృతంగా మార్పులు సంభవిస్తున్న సమయంలో ఇండియా వృద్ధి చెందుతున్నది. ఇ-పుస్తక విప్లవం, జెనెటిక్ మెడిసిన్, 3డి కంప్యూటింగ్, చిత్రాలు, పునరుపయోగ ఇంధన విప్లవం, అంతరిక్ష యాత్ర శకం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
'మీరేమి కావాలని కోరుకుంటున్నారు' అనే ప్రశ్నకు ఈనాటి పిల్లలు ఇచ్చే సమాధానాలకు రేపటి పిల్లలు ఇవ్వబోయే సమాధానాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. అయితే, 'పని స్వేచ్ఛ' అనే మరొక ముఖ్య అంశం కూడా ఉన్నది. రేపు ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయి. తాము ఎవరి దగ్గర పని చేయాలో ఎంచుకునే వ్యక్తులు ఉంటారు. వారు వేతన ప్యాకెట్ ప్రాతిపదికపై కాకుండా నైతిక విలువలు, 'గ్రీన్' విధానాలు, ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు ఆధారంగా తాము పని చేసే సంస్థను ఎంచుకుంటారు.
News Posted: 26 January, 2010
|