కుబేరుడైన 'దొంగ' తిరునల్వేలి : ఓ దొంగ ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. ఏవో బ్యాంకులు దోపిడీలు చేసి, హత్యలు చేసి సదరు దొంగ ఏనాడు దోచుకో లేదు. కేవలం మహిళల మెడలోని గొలుసులను మాత్రమే కాజేసేవాడంతే. కానీ ఆ చిన్న దొంగతనంతోనే కోట్లది రూపాయలు కూడబెట్టి కోటీశ్వరుడైపోయాడు. అంతేకాదు తనకున్న ఇద్దరు కూతుర్లలో ఒకరు డాక్టర్ చదువుతుండగా, మరో కుమార్తెను లా చదివిస్తున్నాడా దొంగ తండ్రి. అంతేకాదు మూడు కార్లు.. నాలుగు బైక్ లు, 5 కోట్ల ఆస్తులు. అధునాతన భవంతిలు సంపాదించాడా బంగారు దొంగ. ఇదేదో విచిత్రంగా, బాలీవుడ్ సినిమా కథనాన్ని తలపించేలా ఉంది కదూ. అవును సినీ ఫక్కీలో దోచుకున్న ఓ దొంగ బండారం బయటపడగానే పోలీసులు కూడా నెవ్వెరపోయారు.
తిరునల్వేలి నగరంలోని విరుధునగర్ లో ఆరవై ఏళ్ల చెల్లయ్య దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. గుడులకు, చర్చిలకు, మసీదులకు వచ్చే మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులను సునాయాసంగా దోచుకునేవాడు. కేవలం ఒక చిన్న బ్లేడ్ నే ఆయుధంగా చేసుకొని క్షణంలో బంగారం గొలుసులు తెగేలా దానిని పదును చేసాడు. ఆ ఒక్క బ్లడ్ ఆధారంగా దొంగతనాలనే వృత్తిగా తీసుకొని చాలాకాలంగా నిరాటంకంగా తన చేతి వాటాన్ని ప్రదర్శించి కోట్ల రూపాయలను సంపాదించాడు. అయితే ఇటీవల ఓ చిన్న కేసులో పోలీసులకు చెల్లయ్య దొరికిపోయాడు. అంతే చిన్న బ్లేడ్ తో చెల్లయ్య సంపాందించిన ఆస్తులను చూసి పోలీసులకు సైతం దిమ్మతిరిగిపోయింది. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు కార్లు, మూడు బైక్ లు, మరో ఆటో రిక్షా, 240 తులాల బంగారం, 5 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించి పత్రాలు పోలీసుల సోదాల్లో బయటపడ్డాయి. అంతేకాక చెల్లయ్యకు విరుధ్ నగర్ లో సెల్ ఫోన్ షాపు, కంప్యూటర్ సెంటర్ లు కూడా ఉన్నాయి. అలాగే ఆయన ఇంట్లో ఖరీదైన అధునాతన ఎల్ సీ డీ టీవీలు, ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్ లుతో పాటు మరెన్నో విలాసవంతమైన పరికరాలు బయటపడ్డాయి.
News Posted: 30 January, 2010
|