మీ సంగతి చెప్పే కాఫీ
సిడ్నీ : అర చేయి చూసి జోస్యం చెప్పడం తెలుసు. ముఖం చూసి మీరేంటో మొత్తం చెప్పేవారున్నారు. కానీ ఇప్పడు మీరు తాగే కాఫీని బట్టి కూడా మీ వ్యక్తిత్వం తెలిసిపోతుంది. చేతిలో ఉన్న కాఫీ కప్పు అడుగున ఉండే షుగర్, పొడి ఉన్నట్లే మీ వ్యక్తిత్వం కూడా ఉంటుందంటున్నారు బాడీ లాంగ్వేజీ నిపుణులు. సిడ్నీకి చెందిన జూడీ జేమ్స్, జేమ్సే మూరేలు ' ద యూ కోడ్' పేరిట పుస్తకాన్ని రాసారు. తాగే కాఫీని బట్టి వ్యక్తిత్వాన్ని నిర్దారించవచ్చునని వారు ఈ పుస్తకంలో వివరించారు. మనుషుల్లో దాగి ఉన్న ఒత్తిడితో పాటుగా వ్యక్తత్వ, శృంగార లక్షణాలను కాఫీ వివరిస్తుందంటున్నారు జేమ్స్ , మూరేలు. కాఫీ తాగేవారిని వారు పలు రకాలుగా విభజించారు.
ద ఎస్ప్రెస్సో కాఫీ తాగేవారిని మూడీ ఫెలోగా అభిర్ణస్తూ వారి లక్షణాలను కూడా వివరించారు. మూడీ గా ఉండటం, కష్టించి పనిచేయడం, నిర్ధేశిత లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆశించడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని పేర్కొన్నారు. అలాగే విశ్వాసం లేకపోవడం, హుందాతనంగా ఉండకపోవడం వంటి మైనస్ పాయింట్ లు ఉంటాయని వివరించారు.
అలాగే బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడేవారిని కూడా జేమ్స్, మూరేలు ప్రత్యేక వర్గంగా గుర్తించారు. వీరు జీవితంలో సమస్యలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారని వివరించారు. ఆలాగే వీరు చేసే ప్రతీ పనీ బహిర్ముఖంగా ఉంటుందని పేర్కొన్నారు. వీరు మిత్రులకు, భాగస్వామికి, సహచరులకు శక్తివంతులుగా కనిపిస్తారు. అలాగే కాఫీ తాగే వారిలో ద లట్టీ కాఫీ తాగడానికి ఇష్టపడే వారిని మరో వర్గాన్ని కూడా జేమ్స్ , మూరేలు విభజించారు. వీరు విధేయంగా వ్యవహరిస్తూంటారని, ఆలాగే అపరిపక్వంగా ఉంటారు. బోమ్మలను హత్తుకునేందుకు ఎక్కువగా ఇష్ఠపడుతుంటారు. ద లట్టీ తాగే వారు బాస్ అయినట్లైతే వారు ఆగ్రహం ప్రదర్శించేందుకు ఉత్సుకత చూపతారని చెబుతున్నారు. రాత్రి నిద్ర పోయే సమయంలో పాలు తాగడానికి ఇష్టం చూపడం వీరి ప్రత్యేకత.
అలాగే కాప్యుసినో కాఫీ తాగేవారిని మరో వర్గంగా పేర్కొన్నారు. ఈ తరహా మనుషుల్లో మతిస్థిమితం తక్కువగా ఉంటుందని, శారీరకంగా కష్టపడి పని చేసినా, తల్లి నుంచి ఆదేశాలు వస్తేనే కాని ఏ పని చేయడానికి ముందుకు రారని, సెక్స్ అమితంగా ఆనందించగలిగినా వెంటనే బోర్ ఫీలవుతారు. అలాగే ఇన్ స్టెంట్ కాపీ డ్రింకర్లుగా మరో వర్గాన్ని కూడా జేమ్స్ , మూరేలు విభజించారు. వీరు చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఆలాగని జీవితం పట్ల ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగలేరని వివరించారు. లేనిపోని గొప్పలు చేప్పుకునే మనస్తత్వం వీరి సొంతమట. అలాగే ద డికేఫ్ సోయ్ మిల్క్ కాఫీ తాగే మరో వర్గం కూడా ఉంది. వీరు చాలా వరకు స్వార్ధపరులని, తమ మనస్త్వత్వాన్ని దాచుకొని, బయటకు ఆడరంబరంగా కనిపించడం వీరి ప్రత్యేకత.
ఇక ద ఫ్రప్యూసినో కాఫీ తాగే మరో రకం వారు కూడా ఉన్నారు. వీరు దేన్నైనా సరే ఓ సారి ఇష్టపడితే అది తమ సొంతం కావాలనుకుంటారట. సెలబ్రిటీలు ఎవరైనా చేస్తే వెంటనే వీరు కూడా అదే చేయడానకి ఇష్టతను ప్రదర్శిస్తారు. వీరికి వీరే ట్రెండ్ సెట్టర్లలా ఫీలవతుండటం వీరి లక్షణం. ఎప్పటికప్పుడు స్నేహాలను, బంధాలను మార్చడం వీరికే సొంతమని జేమ్స్ , మూరేలు వెల్లడించారు.
News Posted: 25 February, 2010
|