కోయంబత్తూర్ : మంచినీళ్లు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేసాడో కసాయి. భోజనం చేస్తుండగా అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో తన తల్లిని దుడ్డుకర్రతో కొట్టి ప్రాణాలు తీసాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘోరం చోటుచేసుకుంది. గోవిందమ్మాళ్ తన పెద్ద కొడుకు శక్తివేల్ కు ఈనెల 23 రాత్రి భోజనం పెట్టింది. తింటుండగానే శక్తివేల్ మంచినీళ్లు కావాలని తల్లిని అడిగాడు. ఆమె తెచ్చేలోగానే శక్తివేల్ కోపంతో విచక్షణ మరచిపోయాడు. అక్కడే ఉన్న దుడ్డు కర్రతో తల్లి తలపై బాదాడు. దీంతో తీవ్రగాయాల పాలైన గోవిందమ్మాళ్ ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి మృతి చెందింది.