ప్రాణాలు తీసిన 'అక్రమం' ఆగ్రా : వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నఓ జంట అగ్నికి ఆహుతయ్యింది. తన భార్య అక్రమ సంబంధం ఏర్పరుచుకోవడంపై ఆగ్రహించిన ఓ భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు సమీపంలోని ఖాందౌలిలో దుర్ఘటన జరిగింది. దిలీప్, మాలాకు చాలా క్రితం పెళ్లైంది. అయితే ఇద్దరి పిల్లలకు తల్లి అయిన మాలా శ్యామ్ ప్రతాప్ అనే నలుగురు పిల్లలకు తండ్రైన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. దీనిని సహించలేని మాలా భర్త దిలీప్ వ్యూహం ప్రకారం శ్యామ్ ను హోలీ పండగ సందర్భంగా తన ఇంటికి ఆహ్వానించాడు. సోమవారం నాడు శ్యామ్ ఇంటికి రాగానే దిలీప్ కుటుంబం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో మంటల్లో చిక్కుకున్న శ్యామ్ ప్రతాప్ ను కాపాడేందుకు మాలా ప్రయత్నించింది. ఈ మంటల్లో మాలా కూడా చిక్కుకుంది. దీంతో శ్యామ్ ప్రతాప్, మాలాల శరీరం 90 శాతంపైగా కాలిపోవడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
News Posted: 3 March, 2010
|