'వాలెంటైన్' వైరస్!
న్యూఢిల్లీ: 'వాలెంటైన్స్ డే'ను ప్రేమ పురుగు కుట్టేస్తోంది. ప్రేమికుల హృదయం (ఇన్ బాక్స్)లో ఈ ప్రేమ పురుగు చొరబడి స్వైరవిహారం సాగిస్తోంది. దోషపూరితమైన ఇ-మెయిల్స్, స్పైవేర్ తో అనేక రకాల వైరస్ లు సైబర్ స్పేస్ ను ఆక్రమించి ప్రేమికుల మెయిల్ బాక్స్ లతోపాటు వారి కంప్యూటర్లను అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రేమ పేరిట మిమ్మల్ని ప్రలోభపెట్టడానికి స్పామర్లు, హ్యాకర్లు అత్యుత్సాహంతో పని చేస్తూ వైరస్ లను వదలుతున్నారు. అవి మీ కంప్యూటర్ ను, చివరకు లాన్ ను కూడా పాడు చేయగలవు. ఈ విధంగా ఇంటర్నెట్ లో విజృభించిన మూడు లవ్ వైరస్ లను గుర్తించారు. అవి : వాలెడాక్ వాలెంటైన్స్ డే థీమ్, ఓన్లీయు.ఎక్సీ, యుఅండ్ మి.ఎక్సీ. అవి రహస్య తప్పుడు సమాచారంతో స్పామ్ లు లేదా ఇ-మెయిల్స్ గా రూపుదిద్దుకోవచ్చు.
ఈ ప్రేమ సీజన్ లో సైబర్ స్పేస్ లో ప్రేమికుల మధ్య మిలియన్ల కొద్దీ ఇ-కార్డులు పంపిణీ అవుతాయి, ఆన్ లైన్ బహుమతి లావాదేవీలు సాగుతాయి. అవి ఏటా స్పామర్ల, హ్యాకర్ల స్వైర విహారానికి కారణమవుతాయి. 'ఎంజాయ్ యువర్ వాలెంటైన్స్ డే విత్ గ్రాండ్ క్యాష్ ఫ్రమ్ అజ్' (మా దగ్గర నుంచి ఎక్కువ నగదుతో మీరు ప్రేమికుల రోజు జరుపుకోండి), 'గ్రేట్ వాచెస్ ఫర్ యువర్ వాలెంటైన్' (మీ ప్రేమికురాలికి లేదా ప్రేమికునికి ఇవ్వడానికి గొప్ప వాచీలు), 'మేక్ యువర్ వాలెంటైన్ హ్యాపీ విత్ ది పర్ఫెక్ట్ టైమ్ పీస్' (చక్కటి టైమ్ పీస్ తో మీ ప్రేమికురాలిని లేదా ప్రేమికుని ఆనందపరవశులను చేయండి) వంటి ఆకట్టుకునే నినాదాలతో కూడిన అవాంఛిత ఇ-మెయిల్స్ ను తప్పంచుకోవలసిందిగా వెబ్ వినియోగదారులను నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్ ను తెరవవద్దని, వీటిని చూసిన మరుక్షణమే ఇన్ బాక్స్ నుంచి వీటిని తొలగించవలసిందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 12 February, 2009
|