దావూద్ గుప్పెట్లో పైరసీ రాకెట్
ముంబై: బాలీవుడ్ తో చీకటి ప్రపంచానికున్న అనుబంధం ఈనాటిది కాదు. దావూద్ సామ్రాజ్యం కనుసన్నల్లో బాలీవుడ్ నడుస్తోందనడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ నిర్మాతల డబ్బు ప్రధానంగా చీకటి సామ్రాజ్య ఖజానా నుండి వస్తున్నదే. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీమ్ చీకటి సామ్రాజ్యం బాలీవుడ్ లో పలు రూపాల్లో విలసిల్లుతోంది. సినీ ఫైరసీ వ్యాపారంపై దావూద్ గ్యాంగ్ ఆధిపత్యముంది. ఈ పైరసీ వ్యాపారం ద్వారా వస్తున్న లాభాలు దావూద్ టెర్రర్ యంత్రాంగానికి నేరుగా చేరుతున్నాయని ఒక నివేదిక వెలుగు చూసింది.
మేధో సంపత్తిని దొంగతనాలతో వ్యవస్థీకృత నేర ప్రపంచానికున్న అనుబంధంపై కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న 'ర్యాండ్ కార్పొరేషన్' సంస్థ 'ఫిల్మ్ పైరసీ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం' అన్న పరిశోధన నివేదిక రూపొందించింది. ఫిల్మ్ పైరసీ ద్వారా తీవ్రవాదానికి నిధులు సమకూర్చడంలో ఒక పెద్ద యంత్రాగం నెలకొని ఉందని ర్యాండ్ కార్పొరేషన్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా డి-కంపెనీ (దావూద్ కంపెనీ) అజమాయిషీలో ఫిల్మ్ పైరసీ వ్యాపారం సాగుతోందని ఆ నివేదిక వెల్లడించింది.
Pages: 1 -2- -3- -4- News Posted: 6 March, 2009
|