'మహా' విజయావకాశాలు!
హైదరాబాద్: తొలివిడత ఎన్నికలు జరుగనున్న 22 లోక్ సభ నియోజకవర్గాల్లో 15 నుండి 18 నియోజకవర్గాలను మహాకూటమి కైవసం చేసుకుటుందని రాకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెజారిటీ స్థానాలను తామే గెలుచుకుంటామని కూటమిలోని పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 16న తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని మొత్తం 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 110 నియోజకవర్గాలను గెలుచుకోడానికి కూటమి నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగామలోని 119 నియోజకవర్గాల్లో కనీసం 90 నియోజకవర్గాలను గెలుచుకోవాలన్నది వారి లక్ష్యం. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో గల 20 గ్రామాల్లో తాము బలంగా ఉన్నామని వారు ధీమాగా చెబుతున్నారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కలర్ టివిల పంపిణీ, సమగ్ర ఆరోగ్య బీమా పథకం పట్ల ప్రజలకు ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోందని, ఈ నాలుగు రోజులు ఈ పథకాలను ఇంకా ప్రజల్లోకి తీసుకు వెళ్తే విజయావకాశాలు ఇంకా మెరుగుపడతాయని మహాకూటమి నాయకులు విశ్వసిస్తున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, విజయావకాశాలను ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే అంచనా వేశారని, మెజారిటీ లోక్ సభ స్థానాల్లో తమ అభ్యర్ధులే గెలుపుబాటలో ఉన్నారని చెబుతున్నారు. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార సరళిని, అభ్యర్ధుల విజయావకాశాలకు సంబంధించి ఒక సమగ్రమైన సర్వేను జరిపించారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 13 April, 2009
|