హస్తం హవాకు హాల్ట్?
కడప: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో మలి విడత పోలింగు ఏప్రిల్ 23న జరుగనుంది. గత మూడు దశాబ్దాలుగా ఆయన ఆధిపత్యం కొనసాగుతున్నఈ జిల్లాలో ఈసారి ప్రత్యర్ధులు పాగా వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.హస్తం హవా తగ్గవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. సిఎం ఇలాకాలో సత్తా చాటుకోవాలని తెలుగుదేశం తహతహలాడుతుండగా, పులివెందులతో సహా పలు నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలని ప్రజారాజ్యం పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. సిఎం కోటలో పాగా వేయడానికి రెండు వైపులనుండి తెలుగుదేశం, ప్రజారాజ్యం పావులు కదుపుతున్నాయి. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సందర్భంగా తెలుగుదేశం ఆచితూచి నిర్ణయాలు తీసుకోగా, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో అసంతృప్తి, అసమ్మతి, గందరగోళం నెలకొన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తాజా పరిస్థితిని గమనిస్తే...
కడప: కాంగ్రెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అహమ్మదుల్లాకు మళ్లీ టిక్కెట్ ఇవ్వగా, పార్టీలోని ప్రత్యర్ధి వర్గం ఆయన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పార్టీలోని అన్ని వర్గాలు ప్రచారాన్ని మందకొడిగా సాగిస్తున్నాయి. అదే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అఫ్జల్ అలీ ఖాన్ ను ప్రజారాజ్యం అభ్యర్ధిగా బరిలో దించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీలో వున్న మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి విజయం తనదేనన్న ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.
పులివెందుల: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో వున్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారాజ్యం అభ్యర్ధిగా చిన్న గంగిరెడ్డి ఆయనతో తలపడుతున్నారు. పులివెందులలో సిఎం ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో దెబ్బతీయాలని తెలుగుదేశం, ప్రజారాజ్యం శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఫలితంగా గతంలో ఇక్కడ కాంగ్రెస్ కు పడిన
ఓట్లలో చీలిక ఏర్పడనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Pages: 1 -2- -3- -4- News Posted: 21 April, 2009
|