విడిపోతున్న హృతిక్-సుజానే?
బాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా కలిసి కాపురం చేస్తున్న ప్రేమజంటగా హృతిక్ రోషన్, సుజానేకు మంచి పేరుంది. అయితే ఇది నిన్నమొన్నటి మాట కాబోతోందా? వీరి కాపురం కుప్పకూలబోతోందా? అవునంటూ...పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సుజానే రోషన్ తన భర్తకు దూరంగా పిల్లలు ఇద్దరినీ వెంటబెట్టుకుని జూహూలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం 'కైట్స్' చిత్రంలో నటిస్తున్న హృతిక్ ఆ చిత్రంలో తనకు జోడిగా నటిస్తున్న స్పానిష్ అందగత్తె బార్బరా మోరీతో జరుపుతున్న రొమాంటిక్ లీలల పర్యవసానమే సుజానే నిర్ణయానికి కారణంగా ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలలుగా ఎంతో ఓర్పుతో ఉన్నసుజానే చివరకు ఇంటి నుంచి వెళ్లిపోవాలనే స్థిర నిశ్చయానికి వచ్చిందని అంటున్నారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ, హృతిక్-సుజానే ఉంటున్న ఇంటికి మరమ్మతు పనులు పనులు జరుగుతున్నందున తాత్కాలికంగా ఆమె జూహూలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందనీ రోషన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొద్దికాలంగా హృతిక్-సుజానేల మధ్య కలతలు ఏర్పడిన విషయం నిజమేనని రోషన్ కుటుంబానికి సన్నిహితుడైన ఒకరు తెలిపారు. 'మొదట్లో హృతిక్ జీవితంలో మరో దశగానే బార్బరాను అంతా భావిస్తూ వచ్చారు. హృతిక్ మినహా ఆ వ్యవహారాన్ని ఎవరూ అంత సీరియస్ గా పట్టించుకోలేదు. హృతిక్ కు నచ్చజెప్పాలని సుజానే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయనకు దూరంగా వెళ్లిపోవాలనే ఆలోచన చేసింది. ఈ విషయంలో ఆమెకు తల్లిదండ్రులు కూడా అండగా నిలుస్తున్నారు' అని ఆయన వివరించారు.
Pages: 1 -2- -3- News Posted: 7 April, 2009
|