పాత్ర పట్టు..అవార్డు కొట్టు హాలీవుడ్...బాలీవుడ్...టాలీవుడ్ ఏదైనా సరే... అవార్డు కొట్టాలా? పట్టాలా? ఇవేం ప్రశ్నలని అడగకండి. అవార్డు వస్తుందని, ఇస్తారని అనుకుంటే మనంత అమాయకులెవరూ ఉండరు. అది నందయినా, బంగారు నెమలయినా, అస్కారయినా... అవార్డు ఇప్పించుకోడానికి, రప్పించుకోడానికి అనేక మార్గాలున్నాయని సినీ పండితుల(తల పండిన వారే లెండి) ఉవాచ.. ఉద్బోధ. ఇంగ్లీషులో చాలా గొప్పగా దాన్ని లాబీయింగ్ అంటారు. దానికి ఏజెంట్లూ ఉంటారు. మన తెలుగులో కూడా నందులు రావాలంటే ఆషామాషీయేం కాదు.
అదంతా సరేగానీ మన ఫిల్మ్ ఫేర్ అయిపోయింది. ఆదివారం నాడే ఆస్కార్. ఓ అవార్డును అలా పడుంటాదిలే అనుకుని బుట్టలో వేసుకోవాలంటే ఇదిగో ఈ దశ సూత్రాలను పాటించి చూడండి. లక్కుంటే టక్కున నందో, నెమలో, మీ రొట్టె విరిగి నేతిలో పడితే ఏకంగా అస్కారో దక్కేయవచ్చు.
తాగుబోతు పాత్రలు
పచ్చి తాగుబోతు.. మత్తులో జోగుతూ సమాజాన్ని తిట్టే డైలాగులు. ఒకమ్మాయితో వ్యవహారం నడుపుతూ మరో అమ్మాయిని ప్రేమించే పాత్రలు. ఏ నటుడైనా రాముడు మంచి బాలుడు పాత్రలు వేసి, తెరపై పొగతాగని, మందు ముట్టని, పేకాట లాంటి దుర్వ్యసనాలు లేకుండా ఏకపత్నీవ్రత పాత్రలు వేస్తే ప్రేక్షకుల హృదయాలను గెలవచ్చేమో గాని ఆ నటుడికి చచ్చినా అవార్డు రాదంటే రాదంతే. కావాలంటే చూడండి దేవదాసులో షారూక్ ఖాన్, అలానే అలనాడు దిలీప్ కుమార్ లకు తాగుబోతులుగా అద్భుతంగా నటించినందుకే అవార్డులు వచ్చాయి. లివింగ్ లాస్ వేగాస్ అనే ఇంగ్లీషు సినిమాలో తాగుబోతు పాత్రలో జీవించిన నికోలస్ కేజ్ కు ఆస్కార్ అందింది.
Pages: 1 -2- -3- News Posted: 5 March, 2010
|