ప్రేమకు 'మాంద్యం'లేదు
వేలంటైన్స్ డే సందర్భంగా యువతను దృష్టిలో ఉంచుకుని 'నిర్వాణ'బ్రాండ్ పేరు మీద సరికొత్త మోడల్స్ ను అందుబాటు ధరల్లో ఫైన్ జుయలరీ సంస్థ విడుదల చేసింది. ప్రారంభ స్థాయిలో నలుపు, తెలుపు డైమండ్స్ పొదిగిన 'టెంప్టేషన్'అనే ఆభరణాలను 6వేల రూపాయల ధరకు నిర్వాణ విడుదల చేసింది. 6-10 వేల రూపాయల మధ్య ధరలో రెండవ శ్రేణి ఆభరణాలను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. కేఫ్ కాఫీ డే సంస్థతో ప్రఖ్యాత ఆభరణాల సంస్థ 'తనిష్క'వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది.
గీతాంజలి గ్రూప్ కు చెందిన డి డమస్ వేలంటైన్ డేకి చాలా ఆభరణాల మోడళ్ళను యువతను దృష్టిలో పెట్టకుని మార్కెట్లోకి విడదల చేస్తోంది. ఈ సంస్థ 3 వేల రూపాయల ప్రాథమిక ధర నుండి ఆభరణాలను రూపొందించింది. దీనికి తోడు పలు ఆఫర్లు, గిఫ్టులతోపాటు పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను డి డమస్ సంస్థ వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది.అదే విధంగా 'ఆర్చీస్'సంస్థ 600 రకాల వేలంటైన్స్ డే ఐటమ్స్ ను విడుదల చేసింది. వాటిలో 192 రకాల లవ్ కార్డ్ స్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది వేలంటైన్స్ డే అమ్మకాలు రెండింతలు కానున్నాయని పలు సంస్థలు భావిస్తున్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 11 February, 2009
|