ప్రేమకు 'మాంద్యం'లేదు
ఆర్చీస్ సంస్థ మార్కెటింగ్ చేసే ఉత్పత్తులు 20 రూపాయల నుండి 10,999 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఈ విధానం వలన ఆర్ధిక మాంద్యం ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకునేందుకు వీలుంటుంది. 'తమ ప్రేమాస్పద సన్నిహితులకు పలు రకాల ఖరీదైన గిఫ్టుల్ని అందించనవసరంలేని వారికి పనికి వచ్చే అత్యంత చౌకైనగిఫ్టుల నుండి అత్యంత ఖరీదైన గిఫ్టుల దాకా మేము మార్కెటింగ్ చేస్తున్నాము'అని ఆర్చీస్ అధికార ప్రతినిధి ఆరియా తెలిపారు. ఆర్చీస్ వార్షిక అమ్మకాల్లో వేలంటైన్ డే అమ్మకాలు 15 శాతంగా ఉన్నాయి. కంపెనీ ఈ ఏడాది వేలంటైన్ అమ్మకాల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. మా కంపెనీ శాఖలన్నీ యధావిధిగా ఆర్డర్లను పంపాయి. ఈ ఏడాది కూడా మార్కెట్ పాజిటివ్ గానే ఉందని ఆరియా తెలిపారు.
అదే విధంగా వేలంటైన్స్ డే సందర్భంగా చికెన్ వ్యాపారం కూడా బాగానే సాగుతుందని 'బాంబే బ్లూ' రెస్టారెంట్ చైన్ సంస్థ నడిపే 'బ్లూ ఫుడ్స్' అధికార ప్రతినిధి తెలిపారు. బాంబే బ్లూలో రెండు భోజనాల ఖరీదు 600 రూపాయలు మాత్రమే. నూడుల్ బార్ రెస్టారెంట్లో రెండు భోజనాల ప్యాకేజి ఖరీదు 700 రూపాయలవతుంది.ప్రతి భోజనానికి అనుబంధంగా కొద్దిగా వైన్ నుం అందించనున్నామని బ్లూ ఫుడ్స్ అధికార ప్రతినిధి తెలిపారు.అదే విధంగా ప్రముఖ కేఫ్ కాఫీ డే సంస్థ కూడా పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రకటించింది.
Pages: -1- -2- 3 News Posted: 11 February, 2009
|