మెమొరి రహస్యమిదే!
న్యూఢిల్లీః గణిశాస్త్రమంటే గుండె గుభేల్ మంటోందా? ఆల్జీబ్రాతో గుండె గాభరా అవుతోందా? కష్టపడి నేర్చుకున్నదంతా పరీక్షల్లో రాసేంతవరకు గుర్తుండదన్న అనుమానమా? ఇవన్నీ విద్యార్దుల జ్ఞాపకశక్తి తాలూకా సమస్యలు. ఆధునిక జీవన శైలికి అనుగుణంగా విద్యారంగంలో కూడా తీవ్రమైన పోటీ ఏర్పడటంతో విద్యార్ధులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వారిలో నెలకొన్న ఉద్విగ్నత జ్ఞాపక శక్తి లాంటి పలు అభివ్యక్తి (కాగ్నిషన్) సమస్యలకు దారితీస్తోంది. ఈ సమస్యల పరిషకారంపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. 25 ఏళ్ల గణిత అపర మేధావి, పరిశోధకుడు నితిన్ వత్స అభివక్తి సమస్యలను పరిష్కిరంచడంపై తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మీరట్కు చెందిన వత్స 100 అంకెల సంఖ్యతో చేసే గుణకారాన్ని కంప్యూటర్ కంటే వేగంగా లెక్కవేయగలడు. అతను గత మూడేళ్లగా మానవ మెదడు కార్యకలాపంపై అధ్యయనం చేస్తున్నాడు. గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బందులు పడే విద్యార్దులకు ఆయన వద్ద చాలా చిట్కాలు ఉన్నాయి. ఆయన అనుభవంలో నుండి ఆయన కొన్ని టేక్నిక్ లను విద్యార్దులకు సూచిస్తున్నారు. 'నాకు పన్నెండేళ్లనాడు ఎన్ని అంకెల సంఖ్యతోనైనా సులభంగా గుణించేందుకు వీలుగా నేనొక చిట్కాను కనుగొన్నాను. దాంతో మానవ మెదడు ఒక యంత్రంలాంటిదని నాకర్థమయ్యింది. దాని సహకారంతో మనం దేన్నైనా గుర్తు పెట్టుకునేందుకు వీలుంటుంది.'అని వత్స తెలిపాడు.
'ఉదాహరణకు ఒక గణిత సమస్యను ఒకటికి మించిన పద్ధతుల ద్వారా పరిష్కారం చేయవచ్చు.ఒకానొక పరిష్కార పద్దతి మిగిలిన పద్దతుల కంటే తేలికగా ఎందుకు అనిపిస్తుంది? ఆ పద్దతిని వినియోగించేటప్పుడు అతి తక్కువ శక్తిని మెదడు వినియోగించడమే ప్రధాన కారణం. అభ్యసన సమయంలో మెదడు కార్యకలాపాలను సాద్యమైనంత తగ్గించే ప్రక్రియల రూపకల్పనపై నేను కృషి చేస్తున్నాను. ఇందువల్ల మెదడు వినియోగించే శక్తి పరిమాణం చాలా తగ్గిపోగలదు. దాంతో ఒక విషయాన్ని వేగంగా నేర్చుకునేందుకు వీలుంటుంది.ఫలితంగా ఒక విషయాన్ని చక్కగా గుర్తుంచుకునేందుకు వీలుంటుది.'అని నత్స తెలిపాడు.
Pages: 1 -2- News Posted: 11 February, 2009
|