మెమొరి రహస్యమిదే!
అద్భుతమైన గణిత శాస్త్ర కౌశలాన్ని ప్రదర్శించినందుకు ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లోకెక్కారు.భవిష్యత్ ఈ-బుక్స్ కు ఈ కృషి సన్నాహక అంశంగా ఉపకరిస్తుంది. భారత గణిశాస్త్ర్రపితామహుడు ఎస్ రామానుజన్ ఫార్ములాను ఆయన మరింతగా అభివృద్ధి చేసారు. ఈ విషయాన్ని బెంగుళూరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్లు సైతం ధృవీకరించారు. రామానుజన్ 19 అంకెల సంఖ్యను ఒక సెకను లోపే గుర్తించుకోవడమనే విన్యాాసంపై ఆయన కేంద్రీకరించారు.
'19 అంకెల సంఖ్యను 1 సెకను కాలంలో గుర్తించుకునే రామన్ క్యాపయో రికార్డును అధిగమించాలనుకుంటున్నాను.ఈ కార్యక్రమం మేలో జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత కష్టతరమైన జ్జ్ఞాపకశక్తి రికార్డులను నేను మా ఐఐఎస్ సి ప్రొసెసర్లు, గిన్నీస్ బృందం వఎదుట ప్రదర్శించాలనుకుంటున్నాను.'అని వత్స తెలిపాడు. ఐఐఎస్ సి, ఐఐటి, గూగుల్, యాహాలు ఏర్పాటు చేసిన వర్క్ షాపుల్లో ఉపన్యసించడం, మానవ మెదడు కార్యకలాపాలను అధ్యయనం చేయడం, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ లో పనిచేయడం లాంటి పనుల్లో వత్స తీరికలేకుండా గడుపుతున్నారు. 'నా గందరగోళపు పని గంటల్ని నా తల్లిదండ్రులు అర్ధం చేసుకున్నారు. అది నా అదృష్టం. వారి సహకారంతో జరిగే కృషి ద్వారా నేను చాలా మంది ప్రజలకు ఉపయోగపడలను, సహకరించగలను.'
Pages: -1- 2 News Posted: 11 February, 2009
|