ఇక జలుబును తరిమేయండి!
న్యూయార్క్: సాధారణ జలుబు రుగ్మతను నయం చేయడమనేది వైద్యానికి ఇంతకాలం అసాధ్యంగా ఉంటున్నది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతున్నది. ఈ రుగ్మతను నయం చేసే రోజులు దగ్గర పడ్డాయి. మామూలు జలుబుకు సంబంధించిన 99 రకాల వైరస్ జెనోమ్ లను తాము డీకోడ్ చేసి దాని బలహీనతల కేటలాగ్ ను తయారు చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. 'మేము అసలు కారణం కమగొన్నాం. మామూలు పడిశానికి అత్యంత సమర్థమైన చికిత్స ఇక సాధ్యమే' అని అమెరికాలోని మేరీలాండ్ విశ్వవిద్యాలయలంలో ఆస్త్మా నిపుణుడు, ఈ పరిశోధన నివేదిక భాగస్వామి స్టీఫెన్ బి. లిగెట్ చెప్పారు.
ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే ఈ బాధ నుంచి విముక్తి కలిగించడమే కాకుండా, జలుబును నయం చేసే ఈ మందు ఆస్త్మాతో బాధ పడే రెండు కోట్ల మందికి, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధితో బాధపడే లక్షలాది మంది ఇతరులకు కూడా ఉపయుక్తమవుతుంది. సాధారణ జలుబు వైరస్ 'రైనోవైరస్' ఆస్త్మారోగులలో సగం మందికి ఈ వ్యాధి రావడానికి కారణమవుతున్నదని భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 14 February, 2009
|