ఇక జలుబును తరిమేయండి!
అలా అయినప్పటికీ, ఇది మందుల కంపెనీలలో ఆసక్తిని రేకెత్తించకపోవచ్చు. కొత్త శోధనలు 'ఆసక్తికరమైన సైన్స్ విజయాలు' అని పెన్సిల్వేనియా ఎక్స్ టన్ లోని వైరోఫార్మా సంస్థలో వైరస్ నిరోధక ఔషధాల నిపుణుడు గ్లెన్ టిల్లట్సన్ పేర్కొన్నారు. కొత్త ఔషధం తయారీకి 'ఫైనాన్షియర్లు, రెగ్యులేటర్లతో ఎడతెగని పోరు సల్పవలసి రావడంతో పాటు' ఇప్పుడు ఖర్చు 700 మిలియన్ డాలర్లని ఆయన చెప్పారు. జలుబు చాలా తక్కువగా బాధ పెడుతుంటుంది కనుక జనం ఖరీదైన మందులకు డబ్బు వెచ్చించకపోవచ్చునని ఔషధ సంస్థలు పేర్కొంటున్నాయి.
ప్లూ బాధను తగ్గించినా పూర్తిగా నయం చేయలేకపోయిన రెండు మందులు రెలెంజా, తమిఫ్లూ వాణిజ్యపరంగా భారీగా నష్టం కలిగించినందున, ఔషధ పరిశ్రమ కొత్త మందు తయారీకి వెనుకాడవచ్చునని సైడెన్ ఫార్మాస్యూటికల్ స్ట్రాటజీస్ సంస్థ అధ్యక్షుడు, చాలా కాలంగా పరిశ్రమ విశ్లేషకుడుగా, కన్సల్టెంట్ గా ఉంటున్న కార్ల్ సైడెన్ పేర్కొన్నారు.
జెనెటిక్ శోధనను మార్కెట్ చేయదగిన ఔషధంగా రూపుదిద్దడం ఒకప్పుడు భావించినదాని కన్నా చాలా కష్టమైన ప్రక్రియ అని ఇటీవలి సంవత్సరాలలో పరిశ్రమ గ్రహించింది. పరిశ్రమకు సంబంధించిన అవరోధాల మాట అలా ఉంచితే, మామూలు జలుబు చాలా కాలంగా చికిత్సకు లొంగకపోవడానికి రైనోవైరస్ పలు రకాలు కావడం, ఏ మందుకూ లేదా వాక్సిన్ కూడా అది దొరకకుండా తప్పించుకుపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 14 February, 2009
|